
మధ్యవర్తిత్వంలో జోక్యమొద్దు
ప్రభుత్వ వైఖరిపై సీజేఐ ఖేహర్
న్యూఢిల్లీ: భారత్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపై వ్యాపారులకు నమ్మకం కలిగించేందుకు ప్రభుత్వం ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ సూచించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం దేశంలో అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వానికి(ఐసీఏ) ఊపునిస్తుందని ఢిల్లీలో ఓ కార్యక్రమంలో అన్నారు.
విదేశీ పెట్టుబడుల వల్ల అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి దేశంలో విస్తృత అవకాశాలున్నాయ న్నారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో ప్రభుత్వ జోక్యాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుండడం, దేశంలోని కోర్టులు తటస్థ దేశం మధ్యవర్తులను నియమిస్తుండడం వల్ల విదేశీ వ్యాపారుల్లో నమ్మకం పెరుగుతుందన్నారు.