CJI Khehar
-
గోప్యత ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు
-
గోప్యత ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు
- తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోపత్య ప్రాథమిక హక్కేనంటూ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. వ్యక్తిగత గోప్యత కూడా రాజ్యంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు) కిందకు వస్తుందని చెప్పింది. గోప్యతపై తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సీజేఐ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జే చలమేశ్వర్, రోహింటన్ నారీమన్, ఆర్కే అగర్వాల్, సంజయ్ కిషన్ కౌల్, ఎస్ఏ బొబ్డే, ఎస్ అబ్దుల్ నజీర్, ఏఎమ్ సప్రేలు ఉన్నారు. మూడు వారాల్లో ఆరు రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆగష్టు 2న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డును తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని ఆగస్టు 2న పేర్కొంది. తీర్పు ప్రభావం ఏంటి? ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలను తెలుపుతుంది కనుక సుప్రీం కోర్టు తీర్పుతో ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును జతచేయాలా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఆధార్ వివరాల ద్వారా వ్యక్తులపై నిఘా పెట్టడం సాంకేతికంగా సాధ్యం కాదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సుప్రీం కోర్టుకు గతంలో చెప్పింది. ఈ పీటముడిపై సంగ్ధితను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోప్యత అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? అనే దానిపై విచారణ జరిపి తీర్పు చెప్పనుంది. -
మధ్యవర్తిత్వంలో జోక్యమొద్దు
ప్రభుత్వ వైఖరిపై సీజేఐ ఖేహర్ న్యూఢిల్లీ: భారత్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపై వ్యాపారులకు నమ్మకం కలిగించేందుకు ప్రభుత్వం ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ సూచించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం దేశంలో అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వానికి(ఐసీఏ) ఊపునిస్తుందని ఢిల్లీలో ఓ కార్యక్రమంలో అన్నారు. విదేశీ పెట్టుబడుల వల్ల అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి దేశంలో విస్తృత అవకాశాలున్నాయ న్నారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో ప్రభుత్వ జోక్యాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుండడం, దేశంలోని కోర్టులు తటస్థ దేశం మధ్యవర్తులను నియమిస్తుండడం వల్ల విదేశీ వ్యాపారుల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. -
అభ్యర్థులపై చార్జ్‌షీట్ పడిందో.. ఇక అంతే!
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీస్వీకారం చేసిన వెంటనే జేఎస్ ఖేహర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అభ్యర్థులపై దృష్టిసారించేందుకు సిద్ధమయ్యారు. కళింకిత అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీకి అనుమతి ఇవ్వాలా? లేదా ? అనే అంశంపై చర్చించడానికి రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేసే అప్లికేషన్‌ను ఖేహర్ పరిశీలించనున్నట్టు తెలిపారు. ఐదుగురు జడ్జిలతో వెంటనే రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు చేయాలనే అప్లికేషన్ గురువారం సీజేఐ ముందుకు తీసుకెళ్లినట్టు బీజేపీ సభ్యుడు అశ్వినీ ఉపాధ్యాయ తెలిపారు. ఈ విషయాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణలోకి తీసుకుంటానని, త్వరలోనే రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేస్తానని సీజేఐ ఖేహర్ చెప్పారు. అదేవిధంగా ఛార్జ్ షీట్ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీచేయకుండా డిబార్ చేసే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కూడా సీజేఐ పరిశీలించనున్నట్టు ఉపాధ్యాయ పేర్కొన్నారు. ఉపాధ్యాయ తరుఫున ఈ అప్లికేషన్‌ను మాజీ అడిషినల్ సొలిసిటర్ జనరల్ వికాస్ సింగ్, సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్, సీజేఐ ముందుకు తీసుకెళ్లారు. ఈ పిటిషన్లో 33 శాతం సభ్యులు నేరచరిత్ర కలిగిఉన్నట్టు ఉపాధ్యాయ చెప్పారు. ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం ప్రతేడాది ఈ క్రిమినల్ కేసులు మరింత పెరుగుతున్నాయని తెలిసింది. గోస్వామి కమిటీ, వోహ్రా కమిటీ, క్రిష్ణమూర్తి కమిటీ, ఇంద్రజీత్ గుప్తా కమిటీ, జస్టిస్ జీవన్ రెడ్డి కమిషన్, జస్టిస్ వెంకట్చాలయ్య కమిషన్, ఎన్నికల, లా కమిషన్లు నేరచరిత్రులకు, కళంకితులకు రాజకీయాల్లో స్థానం ఉండకూడదని సిఫార్సు చేశాయి. కానీ ఇప్పటివరకు ఆ సిఫారసులు అమలు కాలేదు. ఇది ఏ ఒక్కరినో టార్గెట్ చేసి తీసుకురావడం లేదని, ముఖ్యమైన ఎన్నికల సంస్కరణలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నామని ఉపాధ్యాయ తెలిపారు. వారంలోగా రాజ్యాంగ బెంచ్‌ను సీజేఐ ఏర్పాటుచేయనున్నారు.