
‘శుభ్రతపై మా ఇద్దరి అభిప్రాయాలూ ఒక్కటే’
ముంబై: పర్యావరణం, పరిశుభ్రత విషయంలో తన, ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయాలు ఒక్కటేనని బాలీవుడ్ నటి కాజోల్ వ్యాఖ్యానించారు. హిందుస్తాన్ యూనీలీవర్ ‘హెల్ప్ ఏ చైల్డ్ రీచ్ 5’ ప్రచారంలో భాగంగా బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీని ఆమె కలిశారు. ‘మోదీ స్వచ్ఛభారత్.. చేతిశుభ్రతపై మేము ప్రారంభించిన కార్యక్రమం రెండూ శుభ్రతకు సంబంధించినవే కావడం యాదృచ్ఛికం. మేము ఒకే దారిలో ఉన్నాం. మా లక్ష్యం కూడా ఒక్కటే’ అని కాజోల్ అన్నారు.