సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని వృద్ధి పథంలోకి తీసుకురావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా ఎకనమిక్ సమ్మిట్–2017’లో భాగంగా జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఆహార వ్యవస్థను అభివృద్ధి పరచడం’ అనే అంశంపై ప్రసంగించారు.
మంచి విధానాల్ని రూపొందించడం, రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేసినప్పుడు వ్యవసాయం, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగాన్ని వృద్ధి పథంలోకి తేవొచ్చని ఆయన అన్నారు. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఈ రంగానికి వాణిజ్యపరమైన యోగ్యతను జోడించాలి. ప్రభుత్వాలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అందరూ ఇందులో భాగస్వాములవ్వాలి..’’ అని పేర్కొన్నారు.
మధ్యతరహా, భారీ తరహా ఫుడ్‌పార్క్‌లు స్థాపించాల్సిన అవసరముందని సూచించారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో దానిని అందిపుచ్చుకోవా లన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ రంగంలో 27.7 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు వీలుగా, నిరుపేదలకు ఆహార భద్రత ఉండేందుకు వీలుగా మన వ్యూహాలుండాలన్నారు. ప్రజల ఆహార అభిరుచులు మారుతున్నాయని, పండ్లు, పాల ఉత్పత్తుల వినియోగం పెరుగుతోందని తెలిపారు. సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీని ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతున్నాం..
‘‘ఆంధ్రప్రదేశ్‌ను ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతున్నాం.ఆక్వాకల్చర్, పాడి పరిశ్రమను వృద్ధి చేస్తున్నాం. ఇలాంటి వేదికల ద్వారా సాంకేతికతను అందిపుచ్చుకుం టున్నాం. నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉండే సాంకేతిక సంస్థలతో కలసి విశాఖలో సెమినార్ నిర్వహిస్తున్నాం. దానికి బిల్‌గేట్స్ వస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.
పారిశ్రామికవేత్తలతో భేటీ
సదస్సు నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశ మయ్యారు. ఇందులో హెచ్‌ఎండీ గ్లోబల్ హెడ్ అజేయ్ మెహతా, ఆటో గ్రిడ్ ఫౌండర్ అమిత్ నారాయణ, ఏషియన్ పెయింట్స్ ప్రతినిధి కేబీఎస్ ఆనంద్, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ తదితరులున్నారు. రాష్ట్రంలో వ్యవసాయో త్పత్తులు, అనుబంధ పరిశ్రమలు, పవర్‌గ్రిడ్, మొబైల్ తయారీ పరిశ్రమల ఏర్పాటుపై వారితో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment