
ఆటోలో షికారు కొట్టిన సీఎం
ముఖ్యమంత్రి అంటే.. మందీ మార్బలంతో.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో ఆ హంగూ.. ఆర్భాటాలే వేరు. సీఎం కాలు బయట పెడితే.. కనీసం 10 వాహనాల కాన్వాయ్ బయలుదేరుతుంది. అయితే.. అవన్నీ బోర్ కొట్టాయో.. ఏమో రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే ఆటో ఎక్కి జైపూర్ లో షికార్లు కొట్టారు. అంతే కాదు... ఇలాంటి అందమైన ఆటోలు కనిపిస్తే వాటిలో ప్రయాణపు మజా ఆస్వాదించండి అని కామెంట్ చేశారు.
తెల్లటి రంగులో.. అందంగా ముస్తాబు చేసిన ఆటోలో షికారు కొట్టిన రాజే.. ఆటో ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. జైపూర్ లో ఎవరైనా.. ఇలాంటి కళాత్మక ఆటోలను చూసినట్లైతే.. వాటి ఫొటోలను ఆర్ట్ ఆన్ వీల్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారి ట్వీట్ కు స్పందన కూడా బాగానే వచ్చింది.
My wonderful ride today -- when you catch these beautiful autos in Jaipur, tweet back with pictures! #ArtOnWheels pic.twitter.com/kDmpPwxEoV
— Vasundhara Raje (@VasundharaBJP) November 3, 2015