
చంద్రబాబు జైపూర్ పర్యటన రద్దు
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైపూర్ పర్యటన రద్దు అయ్యింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కావల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు నేడు అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉండటంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే మరోసారి అధిరోహించనున్నారు. శుక్రవారం ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజేను గవర్నరు మార్గరెట్ అల్వా మంగళవారం ఆహ్వానించిన విషయం తెలిసిందే.