అలహాబాద్: నిఠారీ సీరియల్ హత్యల కేసులో మరణశిక్ష పడిన సురేందర్ కోలీ శిక్షను అలహాబాద్ హైకోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చింది. కోలీ క్షమాభిక్ష పిటిషన్‌ను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరిగిందంటూ ఈ నిర్ణయం తీసుకుంది. 2006లో జరిగిన హత్యలపై కోలీకి 2009లో సీబీఐ కోర్టు మరణశిక్ష విధించింది.కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరగటం వల్ల అతనికి మరణశిక్షను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు పేర్కొంది.