Surender coli
-
కోలీ మరణశిక్ష యావజ్జీవ ఖైదుగా మార్పు
అలహాబాద్: నిఠారీ సీరియల్ హత్యల కేసులో మరణశిక్ష పడిన సురేందర్ కోలీ శిక్షను అలహాబాద్ హైకోర్టు యావజ్జీవ ఖైదుగా మార్చింది. కోలీ క్షమాభిక్ష పిటిషన్‌ను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరిగిందంటూ ఈ నిర్ణయం తీసుకుంది. 2006లో జరిగిన హత్యలపై కోలీకి 2009లో సీబీఐ కోర్టు మరణశిక్ష విధించింది.కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరగటం వల్ల అతనికి మరణశిక్షను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. -
కోలీ ఉరిశిక్ష అమలుపై 29వరకూ సుప్రీం స్టే
న్యూఢిల్లీ : నిఠారీ వరుస హత్యల దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలు నిలిపివేతను సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. కోలీ మరణశిక్ష అమలుపై న్యాయస్థానం ఈనెల 29వరకూ స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. కోలీ ఉరి శిక్ష అమలుపై స్టే కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జూలైలో కోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోలీ లాయర్లు రివ్యూ పిటిషన్ వేశారు. ఖైదీల రివ్యూ పిటిషన్‌పై బహిరంగ విచారణ జరపాలని ఈ నెల 2న సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. అప్పటివరకు ఉరి అమలును నిలిపేయాలన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. శిక్ష అమలుపై స్టే విధించింది. ప్రస్తుం కోలీ మీరట్ జైలులో కట్టుదిట్టమైన భద్రత గల బ్యారక్‌లో ఉన్నాడు. -
కోలీకి ఉరిశిక్ష నిలిపివేత
నిఠారీ హత్యల కేసులో దోషికి వారం పాటు ఊరట న్యూఢిల్లీ: నిఠారీ వరుస హత్యల దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలును సుప్రీంకోర్టు వారం పాటు నిలిపేసింది. ఈ మేరకు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం సోమవారం తెల్లవారుజామున ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను అర్ధరాత్రి పరిశీలించిన ధర్మాసనం ఆ వెంటనే .. స్టే విధించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. మీరట్ జైలులో కట్టుదిట్టమైన భద్రత గల బ్యారక్‌లో ఉన్న 42 ఏళ్ల కోలీని సోమవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే అందుకు కొద్ది గంటల ముందే కోర్టు ఆదేశాలు అందడంతో జైలు వర్గాలు శిక్ష అమలును నిలిపేశాయి. సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ నేతృత్వంలోని లాయర్ల బృందం కోలీ తరఫున తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిక్ష అమలుపై స్టే కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జూలైలో కోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోలీ లాయర్లు రివ్యూ పిటిషన్ వేశారు. ఖైదీల రివ్యూ పిటిషన్‌పై బహిరంగ విచారణ జరపాలని ఈ నెల 2న సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. అప్పటివరకు ఉరి అమలును నిలిపేయాలన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. శిక్ష అమలుపై స్టే విధించింది. సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఫ్యాక్స్ ద్వారా కోర్టు ఆదేశాలను మీరట్ జైలుకు పంపారు. దీన్ని అందుకున్నట్లు ఉదయం 4.30 గంటలకు జైలు వర్గాలు ధ్రువీకరించాయి. దీంతో శిక్ష అమలును అధికారులు నిలిపేసినట్లు పేర్కొన్నాయి.