మహిళా బిల్లుకు కట్టుబడి ఉన్నాం: సోనియా
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆపార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రతిపాదన 1996 నుంచి పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు కొన్ని కారణాల వల్ల లోక్సభలో ఆమోదం పొందలేకపోయిందని సోనియా బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు.
పార్టీ మహిళా కార్యకర్తల సమావేశంలో సోనియా మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి తాము కట్టుబడి ఉన్నామని సభలో బిల్లుకు మద్దతు ఇస్తామన్నారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదానికి ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సోనియా తెలిపారు.