విపక్ష హోదాకు అర్హులమే: సోనియా | Congress entitled to post of Leader of Opposition: Sonia Gandhi | Sakshi
Sakshi News home page

విపక్ష హోదాకు అర్హులమే: సోనియా

Published Tue, Jul 8 2014 4:25 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

విపక్ష హోదాకు అర్హులమే: సోనియా - Sakshi

విపక్ష హోదాకు అర్హులమే: సోనియా

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో అతిపెద్ద విపక్షంగా అవతరించిన తమకు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందే హక్కు ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. ‘విపక్షాల్లో మాది అతిపెద్ద పార్టీ. ఇతర పార్టీలతో ఎన్నికలకు ముందే అవగాహన కుదుర్చుకున్నాం కనుక విపక్ష హోదా పొందేందుకు అర్హులమే’ అని ఆమె సోమవారం పార్లమెంట్ వద్ద విలేకర్లతో అన్నారు. ప్రభుత్వం నిరాకరిస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా, ‘చూద్దాం ’అని బదులిచ్చారు. ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ మహాజన్‌కు లేఖ రాయాలని యూపీఏ ఎంపీలు నిర్ణయించారు.   స్పీకర్ బీజేపీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement