Parilament elections
-
TS: బీఆర్ఎస్తో పొత్తుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీతో గతంలో తాము ఎప్పుడైనా కలిశామా అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ కీలక నేతలతో బీజేపీ స్టేట్ పార్టీ ఆఫీసులో సోమవారం కిషన్‌రెడ్డి సమామేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్, కేసీఆర్ ఆవశ్యకత లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని చెప్పారు. ‘పార్లమెంట్ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడంపై చర్చించాం. పార్టీ ఎమ్మెల్యేలను పార్లమెంట్ ఇంఛార్జ్‌లుగా నియమించాం. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ కన్వీనర్లను నియమిస్తాం. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో సంక్రాంతి తర్వాత ప్రచారం ప్రారంభిస్తాం. తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను బీజేపీ గెలవనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఇక బీఆర్ఎస్, కేసీఆర్ ఆవశ్యకత తెలంగాణ ప్రజలకు లేదు. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్టకు దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 14 నుంచి 22 వరకు అన్ని దేవాలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తాం. 22న ప్రతీ ఇంటా రామజ్యోతులు వెలిగించాలి. హనుమాన్ సినిమా వాళ్ళు ప్రతి టికెట్ పై 5 రూపాయలు రామ మందిరానికి విరాళంగా ఇవ్వడం అభినందనీయం’అని కిషన్‌రెడ్డి అన్నారు. ఇదీచదవండి.. ప్రజాపాలనపై కేబినెట్ భేటీ -
ఎన్నికలపై నినాదాల ప్రభావం
పాట్నా: పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా రాజకీయ పార్టీల నినాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తమ విధానాలను ప్రతిబింబించే విధంగానే కాకుండా ఓటర్లను ఆకర్శంచే విధంగా, ఓ రితమిక్గా నినాదాలు ఉండాలని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ప్రయత్నిస్తుంది. బీహార్ ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్న నేపథ్యంలో పాలకపక్ష జేడీయు, విపక్ష భారతీయ జనతా పార్టీల కొత్త నినాదాలతో ముందుకొస్తున్నాయి. ‘బదలియే సర్కార్, బదలియే బీహార్’ (ప్రభుత్వాన్ని మార్చండి, బీహార్‌ను మార్చండి) అనే నినాదాన్ని బీజేపీ అందుకోగా, ‘బహుత్ హుహా జుమ్లోం కా వార్, అబ్కీ బార్ నితీష్ సర్కార్ (బూటకపు హామీలు ఎక్కువయ్యాయి, నితీష్ ప్రభుత్వానికి ఓటేయండి), మహిళోం కో సురక్షా ఔర్ అధికార్, ఫిర్ ఎక్బార్ నితీష్ కుమార్’ (మహిళలకు భద్రత, అధికారం...నితీష్ కుమార్‌కు మరోసారి ఓటేయండి) అనే నినాదాలతో జేడీయూ ముందుకొచ్చింది. ఇరు పార్టీల వారు నినాదాల బ్యానర్లతో బీహార్ వీధులను నింపేశారు. అమెరికా లాంటి అగ్ర దేశాల్లోనే కాకుండా భారత రాజకీయాల్లో, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో నినాదాల ప్రభావం అంతా ఇంతా కాదు. 1971లో ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆవిడిచ్చిన నినాదం ‘గరీబీ హఠావో’ ఓటర్లను ఎంతో ప్రభావితం చేసింది. అలాగే ‘ఇందిరా హఠావో, దేశ్ బచావో’ అంటూ జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన నినాదం 1977 ఎన్నికల్లో సంచలనమే సృష్టించింది. 1996లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినపుపడు ‘బారీ బారీ సబ్కీ బారీ, అబ్కీ బారీ అటల్ బిహారి’ అనే నినాదం కూడా కొంత మేరకు ఓటర్లను ప్రభావితం చేసింది. ‘అబ్కీ బారీ నరేంద్ర మోదీ’ అనే నినాదం కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎన్నికలతో సంబంధం లేకుండా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1950లో ఇచ్చిన ‘హిందీ-చీని భాయి, భాయి’, ఆయన వారసుడు లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ అంటూ ఇచ్చిన నినాదాలు భారత రాజకీయాలపై ఎంతో ప్రభావం చూపించాయి. -
విపక్ష హోదాకు అర్హులమే: సోనియా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో అతిపెద్ద విపక్షంగా అవతరించిన తమకు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందే హక్కు ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. ‘విపక్షాల్లో మాది అతిపెద్ద పార్టీ. ఇతర పార్టీలతో ఎన్నికలకు ముందే అవగాహన కుదుర్చుకున్నాం కనుక విపక్ష హోదా పొందేందుకు అర్హులమే’ అని ఆమె సోమవారం పార్లమెంట్ వద్ద విలేకర్లతో అన్నారు. ప్రభుత్వం నిరాకరిస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా, ‘చూద్దాం ’అని బదులిచ్చారు. ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ మహాజన్‌కు లేఖ రాయాలని యూపీఏ ఎంపీలు నిర్ణయించారు. స్పీకర్ బీజేపీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ చెప్పారు. -
సీమాంధ్ర బరిలో మిగిలింది వీరే
సీమాంధ్రలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు, ఉపసంహరణల ఘట్టానికి బుధవారం తెరపడింది. దీంతో 13 జిల్లాలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,043 మంది, 25 లోక్‌సభ సీట్లకు 333 మంది చొప్పున అభ్యర్థులు బరిలో మిగిలారు. మే 7న జరిగే పోలింగ్ కోసం 71,282 పోలింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు. బీజేపీతో పొత్తు కారణంగా టికెట్ కోల్పోయిన తెలుగు తమ్ముళ్లు రెబల్ అభ్యర్థులుగా కదనరంగంలో నిలవడంలో ముందున్నారు. అసలే బల‘హీన’ంగా ఉన్నామన్న మనోవేదన ఒకవైపు.. తమ్ముళ్ల అలకలు మరోవైపు టీడీపీ పార్టీకి శిరోభారంగా మారింది. కాంగ్రెస్ పార్టీ చిన్నాచితకా నేతల్ని అభ్యర్థులుగా ఖరారు చేసింది. మొత్తంగా పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి నామినేషన్ల దాఖలు వరకూ ఒకేమాటతో ఎన్నికల రంగంలోకి దూకింది. -
33 మందితో తెలంగాణ ఆప్ రెండో జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. తొలి జాబితాలో 31 అసెంబ్లీ, మూడు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ మరో 33 అసెంబ్లీ, మూడు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఎంపీ అభ్యర్థులు: బెల్లయ్యనాయక్-నల్లగొండ, సునిల్‌కుమార్-జహీరాబాద్, సుంకపాక ప్రసాద్-పెద్దపల్లి.ఎమ్మెల్యే అభ్యర్థులు: కె.రేవంత్రావు గోపాలస్వామి-అంబర్పేట్, అబ్బాస్-ముషీరాబాద్, దునియాలాల్ త్రిపాఠి నిరాల-ఖైరతాబాద్, రాంగోపాల్ యాదవ్-జూబ్లీహిల్స్, జి.ప్రభాకర్‌రెడ్డి-మేడ్చల్, కట్కం నర్సింగ్‌రావు-ఎల్బీనగర్, మీర్ మహ్మద్‌హుస్సేన్- గోషామహల్, రాజశేఖర్‌రెడ్డి అలిపురం-తాండూరు, టి.వెంకటేశ్వర్లు-వికారాబాద్, డి.శ్రీకాంత్‌యాదవ్-వరంగల్‌వెస్ట్, ఎం రాజీవ్‌కుమార్-నారాయణఖేడ్, టి.వెంకటేశ్వర్లు-హుజూర్నగర్, రుషీకేశ్వర్-మిర్యాలగూడ, కె.లక్ష్మి-కోరట్ల, వి.రమేష్-జగిత్యాల, పి.రమణారెడ్డి-నిజామాబాద్ అర్బన్, ఎం.మోహన్-నిజమాబాద్ రూరల్, బాలశౌరి బెల్లకొండ బోధన్, డి.ఆనందం-సిరిసిల్లా, ఎ.శ్రీధర్‌రెడ్డి-వేములవాడ, రొడ్డ మోహన్-చెన్నూర్, బండారి శ్రీనివాస్-బెల్లంపల్లి, పూజారి రమణ-మంచిర్యాల, నాగరాజు-ధర్మపురి, డి.విశ్వనాథ్-మంథని, టి.ఓదెలు యాదవ్-పెద్దపల్లి, ఎండీ మాజీద్ అలీ-బాన్సువాడ, అన్వర్‌పాషా-ఎల్లారెడ్డి, మాల్గ యాదయ్య-మణుగూరు, సంగిశెట్టి నర్సింహా-భువనగిరి, సంగమేశ్వర్ దానక్క- షాద్‌నగర్. -
అనుమానాలొద్దు.. ‘టీ’ ఖాయం!: మన్మోహన్
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రధాని మన్మోహన్ భరోసా దీక్ష వద్దంటే మహిళా మంత్రులపై దాడి చేయించారని సీఎంపై టీ నేతల ఫిర్యాదు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుంది. తెలంగాణపై మేమిచ్చిన హామీని నెరవేరుస్తాం. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు’.. ఇది బుధవారం ఢిల్లీలో తనను కలిసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచ్చిన భరోసా. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వైఖరిపై వారు ప్రధానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణపై అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం అసెంబ్లీలో తీర్మానం చేశారని, సమైక్యాంధ్ర అంటూ ఢిల్లీలో దీక్ష చేశారని వారు ప్రధానికి వివరించారు. ఇకనైనా వెంటనే ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దీక్షకు దిగొద్దని మంత్రివర్గ సహచరులే కోరితే పోలీసులతో వారిపై దాడి చేయించారని ఆరోపించారు. మహిళా మంత్రులనైనా చూడకుండా వారిపై అమానవీయంగా ప్రవర్తించారని తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ప్రసాద్‌కుమార్, గీతారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బస్వరాజు సారయ్య, చీఫ్ విప్, ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎస్.రాజయ్య, సురేశ్ షేట్కార్, అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు. -
రెవెన్యూ శాఖలో ఇక బదిలీల వంతు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ప్రత్యేక ఓటర్ల జాబితా ప్రకటన.. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల నిర్వహణలో తలమునకలైన అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఈ విషయంపై దృష్టి సారించలేకపోయింది. ప్రస్తుతం ఇవన్నీ పూర్తి కావడంతో అధికార యంత్రాంగం తహశీల్దార్ల బదిలీలకు సన్నద్ధమవుతోంది. రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు ఇప్పటికే తహశీల్దార్ల బదిలీలకు సంబంధించి ప్రత్యేక ఫార్మెట్లో వివరాలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ మేరకు జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్ల వివరాలను సీసీఎల్ఏకు పంపారు. సొంత జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లు ఇతర జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లు ఎక్కడెక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు.. సమీప కాలంలో పదవీ విరమణ పొందనున్న తహశీల్దార్ల వివరాలను కలెక్టర్ సీసీఎల్ఏకు నివేదించారు. దీంతో బదిలీ ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సొంత జిల్లాలో పనిచేసే తహశీల్దార్లు విధిగా బదిలీ కావాల్సి ఉంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లు, మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారు, ఈ ఏడాది మే 31 నాటికి ఒకేచోట మూడేళ్లు పూర్తి కానున్న వారికి బదిలీ తప్పనిసరి కానుంది. త్వరలో పదవీ విరమణ పొందనున్న వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించనున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లా నుంచి కనీసం 40 మంది తహశీల్దార్లు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు వెళ్లనున్నారు. ఆయా జిల్లాలకు చెందిన తహశీల్దార్లు కర్నూలు జిల్లాకు రానున్నారు. -
అవరోధమేమీ ఉండదు: సుశీల్‌కుమార్‌షిండే
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ-2 సర్కారు హయాంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంలో ఎలాంటి అవరోధమూ ఉండదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే పేర్కొన్నారు.వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఉద్ఘాటించారు. షిండే శుక్రవారం ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయం వెలుపల మీడియా ప్రతినిధులతో చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటానికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013ను తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర శాసనసభ చివరి నిమిషంలో మూజువాణి ఓటుతో తీర్మానం చేసిన నేపధ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పరిస్థితి ఏమిటని విలేకరులు ప్రశ్నించగా షిండే స్పందిస్తూ.. ‘‘బిల్లు ఆమోదం పొందుతుంది. అందుకు ఎలాంటి సమస్యా ఉండదు’’ అని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి పునర్వ్యవస్థీకరణ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా అందనే లేదని.. దీనిపై తాము అటార్నీ జనరల్ న్యాయ అభిప్రాయాన్ని కోరనూ లేదని మరో ప్రశ్నకు సమాధానంగా షిండే తెలిపారు. తుది బిల్లుపై అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రభావం ఏమీ ఉండదని.. తెలంగాణ ప్రక్రియను పూర్తిచేయటానికి న్యాయపరమైన అడ్డంకులేమీ రావని ఆయన చెప్పారు. కిరణ్ వాదనను తిరస్కరించిన హోంశాఖ! అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అసంపూర్ణంగా ఉందంటూ ముఖ్యమంత్రి కిరణ్ చేసిన వాదనను తిరస్కరిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలియవచ్చింది. ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో.. విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు తేదీ కోసం పార్లమెంటును సంప్రదించాలనే యోచనలో హోంశాఖ ఉన్నట్లు సమాచారం. విభజన బిల్లుకు సంబంధించి రాష్ట్రపతికి సిఫారసు చేయాల్సిన తదుపరి కార్యాచరణపై కేంద్ర మంత్రుల బృందం ఫిబ్రవరి 4న భేటీ అయ్యే అవకాశముందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. -
యూపీఏపై వ్యతిరేకత లేదు: శరద్ పవార్
ముంబై: యూపీఏ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న వార్తలను కేంద్ర వ్యవసాయ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్ కొట్టిపారేశారు. దేశంలో రాజకీయ పరిస్థితులపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు, కొత్త ఓటర్లు కీలక పాత్ర వహించే అవకాశాలున్నాయని చెప్పారు. ఎన్సీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా శరద్‌పవార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 73 ఏళ్ల పవార్ ఇప్పటివరకు 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.