సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీతో గతంలో తాము ఎప్పుడైనా కలిశామా అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ కీలక నేతలతో బీజేపీ స్టేట్ పార్టీ ఆఫీసులో సోమవారం కిషన్‌రెడ్డి సమామేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్, కేసీఆర్ ఆవశ్యకత లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని చెప్పారు.
‘పార్లమెంట్ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడంపై చర్చించాం. పార్టీ ఎమ్మెల్యేలను పార్లమెంట్ ఇంఛార్జ్‌లుగా నియమించాం. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ కన్వీనర్లను నియమిస్తాం. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో సంక్రాంతి తర్వాత ప్రచారం ప్రారంభిస్తాం.
తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను బీజేపీ గెలవనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఇక బీఆర్‌ఎస్, కేసీఆర్ ఆవశ్యకత తెలంగాణ ప్రజలకు లేదు. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్టకు దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 14 నుంచి 22 వరకు అన్ని దేవాలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తాం. 22న ప్రతీ ఇంటా రామజ్యోతులు వెలిగించాలి. హనుమాన్ సినిమా వాళ్ళు ప్రతి టికెట్ పై 5 రూపాయలు రామ మందిరానికి విరాళంగా ఇవ్వడం అభినందనీయం’అని కిషన్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment