
ఆమె నాయకత్వ లక్షణాలు అసాధారణం
ఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది. జయలలిత మరణం జీర్ణించుకోలేని విషాదం అని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. పరిస్థితులను జయలలిత ధైర్యంగా ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రిగా ప్రజల ఆశలు నెరవేర్చేలా పనిచేశారని కొనియాడారు.
జయలలిత నాయకత్వ లక్షణాలు అసాధారణం అని సోనియా గాంధీ పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఆమె అంకితమై పనిచేశారని, పేద ప్రజల జీవితాలను మెరుగుపర్చే పాలన అందించారని అన్నారు. భారత రాజకీయాల్లో జయలలిత పాత్ర చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.