'ఇంటికో ఉద్యోగం పక్కా.. పవర్ ఇవ్వండి' | Congress Releases Manifesto In Assam, Promises Job To 1 Member Of Each Family | Sakshi
Sakshi News home page

'ఇంటికో ఉద్యోగం పక్కా.. పవర్ ఇవ్వండి'

Published Thu, Mar 24 2016 9:44 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'ఇంటికో ఉద్యోగం పక్కా.. పవర్ ఇవ్వండి' - Sakshi

'ఇంటికో ఉద్యోగం పక్కా.. పవర్ ఇవ్వండి'

అసోం: అసోంలో తిరిగి తమకు అధికారం కట్టబెడితే ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. త్వరలో అసోంలో ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ గురువారం రాత్రి పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 'మేం మరోసారి అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇస్తున్నాం.

వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కలిపి మొత్తం పది లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే మా అసలైన లక్ష్యం' అని బహుగుణ అన్నారు. దీంతోపాటు రూ.2.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారందరినీ ప్రత్యేక కుటుంబాలుగా గుర్తించి వారికి ప్రభుత్వ లబ్ధీలు అందేలా చేస్తామని చెప్పారు. అన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఐదేళ్లలో మరో రెండు లక్షల ఉపాధ్యాయ కొలువులు సృష్టిస్తామని తెలిపారు. చిన్నసన్నకారు తేయాకు రైతులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పారు. ప్రతి పర్వత ప్రాంతాల్లోని జిల్లాకు వెయ్యి కోట్లు ఇస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement