జీఎస్‌టీపై మోదీ వ్యాఖ్యలు.. నెట్‌లో హల్‌చల్‌ | Congress tweets old clips of Modi saying,'GST can never be successful' | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీపై మోదీ వ్యాఖ్యలు.. నెట్‌లో హల్‌చల్‌

Published Fri, Jun 30 2017 4:35 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

జీఎస్‌టీపై మోదీ వ్యాఖ్యలు.. నెట్‌లో హల్‌చల్‌ - Sakshi

జీఎస్‌టీపై మోదీ వ్యాఖ్యలు.. నెట్‌లో హల్‌చల్‌

న్యూఢిల్లీ: ఒక వైపు  చారిత్రాత్మక నిర్ణయం.. ఒకే దేశం ఒకే పన్ను అంటూ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్  విధానం  జీఎస్‌టీ ని  కేంద్రం నేటి ప్రత్యేక పార్లమెంట్‌ అర్ధరాత్రి సమావేశంలో గ్రాండ్‌ గా లాంచ్‌ చేయనుంది. మరోవైపు  ఈ వేడుకను బాయ్‌ కాట్‌ చేస్తున్నామని ప్రకటించిన  కాంగ్రెస్ జీఎస్‌టీ వ్యతిరేక ప్రచారాన్ని జోరుగా  నిర్వహిస్తోంది. ఇందుకు ఒకపుడు జీఎస్‌టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రసంగాలకు సంబంధించిన వీడియో  క్లిప్పులను సోషల్‌ మీడియాలో షేర్‌  చేసింది.

అసంపూర్ణమైన జీఎస్‌టీ వ్యతిరేకించడంతో పాటు,  దేశంలో  పెరుగుతున్న నిరుద్యోగం,   పోలీసుల చేతుల్లో రైతుల కాల్చివేత, ముస్లింలపై దాడులు తదితర కారణాల రీత్యా  ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది.  ఈ నేపథ్యంలో బీజేపీ అమల్లోకి తేనున్న జీఎస్‌టీపై వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేసింది.  ఇందుకు  ఒకపుడు  మోదీ ప్రసంగాలను వాడుకుంటోంది. ముఖ్యంగా  జీఎస్‌టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత (గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి) ప్రసంగ క్లిప్లును ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసింది.
జిఎస్టి ఎన్నటికీ విజయవంతం కాదు అన్న  వీడియో ఇపుడు నెట్‌లో చక్కర్ లుకొడుతోంది.  అలాగే  జీఎస్‌టీ  అవసరమైన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా జీఎస్‌టీ అమలు అసాధ్యమైందంటున్న వీడియో  క్లిప్పులను  కాంగ్రెస్‌ శ్రేణులు విపరీతంగా షేర్‌  చేస్తున్నాయి.  మోదీజీ ఈమాటలను అప్పుడే ఎలా మర్చిపోయారంటూ ఎద్దేవా చేస్తున్నాయి.

మరోవైపు విదేశంలో   సెలవులను ఎంజాయ్‌ చేస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాందీ  జీఎస్‌టీ తమాషా అని విమర్శించారు.  సరైన ప్రణాళికలు, దూరదృష్టి , సంస్థాగత సంసిద్ధత లేకుండా జిఎస్‌టీ అమలుచేయడంపై  ఆయన ట్విట్టర్‌లో మండిపడ్డారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement