బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ కుటుంబ పార్టీలే: మోదీ ట్వీట్‌ | Pm Modi Tweet On Brs And Congress Parties | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ కుటుంబ పార్టీలే: మోదీ ట్వీట్‌

Published Sat, Sep 30 2023 9:37 PM | Last Updated on Sat, Sep 30 2023 9:53 PM

Pm Modi Tweet On Brs And Congress Parties - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ కుటుంబ పార్టీలే అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకు కూడా నమ్మకం​ లేదు. అసమర్థ బీఆర్‌ఎస్‌ పాలనతో ప్రజలు విసిగిపో​యారని ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు.

ప్రధాని నరేంద్ర మోదీ.. రేపు(ఆదివారం) తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలకనున్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ.. రేపు రూ. 13,500 కోట్లకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement