కేరళలో ఘర్‌వాపసీ | Converted girl ghar wapsi | Sakshi
Sakshi News home page

కేరళలో ఘర్‌వాపసీ

Published Fri, Sep 22 2017 7:51 PM | Last Updated on Fri, Sep 22 2017 11:13 PM

Converted girl ghar wapsi

సాక్షి, కోచి : కేరళలో ఆరు నెలల కిందట ఇస్లామ్‌ మతం తీసుకున్న 23 ఏళ్ల యువతి.. తిరిగి మాతృవ్యవస్థలోకి వచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు. కసర్‌గాడ్‌ జిల్లాలోని ఉద్మాకు చెందిన అతిరా.. అనే యువతి స్నేహితులు, మరికొందరి ప్రోద్బలంతో మతం మార్చుకుందని.. అయితే అక్కడ ఇమడలేకి తిరిగి హిందూమతంలోకి వచ్చిందని తల్లిదండ్రులు రవీంద్రన్‌, ఆశా తెలిపారు. కసార్‌గాడ్‌లోని ప్రభుత్వ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్‌ చదువుతున్న తన కూతురు.. ఆరు నెలల కిందట నుంచి కనిపించడం లేదని చెప్పారు. అయితే ఆమె ఒకసారి ఫోన్‌ చేసి ’నేను మతం మార్చుకున్నాని.. ప్రస్తుతం నా పేరు ఆయేషా‘ అని చెప్పిందన్నారు. అయితే తిరిగి పూర్వాశ్రమంలోకి వచ్చిన అతిరా.. తన స్నేహితురాలు అనీషా, ఆమె సోదరుడు సిరాజ్‌ బలవంతంతో మతం మార్చుకున్నట్లు చెప్పిందని రవీంద్రన్‌ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement