ghar wapsi
-
Telangana: మళ్లీ ‘షేక్‌హ్యాండ్’.. ఆసక్తిరేపుతున్న కాంగ్రెస్‌లో చేరికలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టినట్టు కనిపిస్తోంది. 2014 తర్వాత పార్టీని వదిలి వెళ్లిన పాత నాయకులను మళ్లీ సొంత గూటికి ఆహ్వానిస్తూ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడితోపాటు కీలక నేతలంతా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలోకి తిరిగి రప్పించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నెల రోజుల నుంచి పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఎట్టకేలకు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో రాజ్యసభ పక్షనేత, సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే దారిలో ఆ పక్క నియోజకవర్గమైన మానకొండూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్ఎస్ నేత ఆరేపల్లి మోహన్ సైతం పార్టీలోకి మళ్లీ వస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ సైతం పార్టీలోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఒకరు, మాజీ ఎమ్మెల్సీ ఒకరు త్వరలోనే పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇకపోతే గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఏమాత్రం సంతృప్తిగా లేని ముగ్గురు మాజీ ఎమ్మెల్సీలు సైతం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు కీలక నేతలను సంప్రదించినట్టు తెలుస్తోంది. రగులుతున్న అసంతృప్తి అయితే, ఈ చేరికలపై పార్టీలో కొంతమందిలో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. హుస్నాబాద్‌లో ప్రవీణ్‌రెడ్డి చేరికతో అక్కడ యాక్టివ్‌గా ఉన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేశారు. అదేవిధంగా మానకొండూర్‌లోనూ ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సైతం ఆరేపల్లి మోహన్ రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. ఇటు మహబూబ్‌నగర్‌లోనూ మాజీ ఎమ్మెల్యేల రాక ప్రస్తుత నేతల్లో కాక పుట్టిస్తోంది. ఒక చేరిక రెండు సవాళ్లుగా మారనున్నట్టు సీనియర్లు చర్చించుకుంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వస్తేనే అందరికీ మనుగడ ఉంటుందని, అసంతృప్తి రాజకీయాల వల్ల మొత్తానికే ఇబ్బంది ఏర్పడుతుందని ముఖ్యనేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ పునర్వైభవం కోసం తప్పదంటూ ముందుకెళ్తున్నట్టు సమాచారం. -
‘ఘర్ వాపసీ’ చేసే ధైర్యముందా?
ముంబై: కేంద్ర పౌర జాబితా(ఎన్నార్సీ) విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని శివసేన సమర్థించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో తమ మద్దతుంటుందని తెలిపింది. ప్రభుత్వాన్ని అభినందించింది. దేశంలో అక్రమంగా ఉండే పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, శ్రీలంకన్లు, రోహింగ్యా ముస్లింలు ఎవరైనా వారిని బహిష్కరించాలని కోరింది. అయితే.. కశ్మీర్లోకి పండిట్ల ‘ఘర్ వాపసీ’ చేసే విషయంలో కేంద్రానికి ధైర్యముందా అని పార్టీ పత్రిక సామ్నాలో ప్రశ్నించింది. ఉగ్రవాదం కారణంగా కశ్మీర్ నుంచి హిందువులను (పండిట్లను) బలవంతంగా పంపేసిన విషయాన్ని మరిచిపోవద్దని సూచించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అసోంలో ప్రకటించినట్టుగా కశ్మీర్‌లోనూ కేంద్ర పౌర జాబితా ప్రకటించాలని కోరింది. దేశంలోని ప్రతి ఇంటిపై హిందుత్వ జెండా ఎగరవేయాలని ఆకాంక్షించింది. -
లవ్ జిహాద్‌పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య
సాక్షి, తిరువనంతపురం : లవ్ జిహాద్ వ్యవహారంపై కేరళ హైకోర్టు గురవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మతాంతర వివాహాలన్నింటిని 'లవ్ జీహాద్' గా అభివర్ణించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అదే సమయంలో మత మార్పిడి కేంద్రాలను రాజ్యాంగ విరుద్ధమని బెంచ్ వ్యాఖ్యానించింది. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు 'ఘర్ వాపసీ' అంటూ మతం మార్పించారని ఎర్నాకులంకు ఓ ముస్లిం యువకుడు కోర్టును ఆశ్రయించాడు. అయితే అన్ని వివాహాలనూ లవ్ జిహాద్ లేదా ఘర్ వాపసీగా భావించలేమని కోర్టు పిటిషనర్‌కు తెలిపింది. ప్రతి మతాంతర వివాహాన్నీ.. మత కోణంలో పరిశీలించడం సాధ్యపడదని జస్టిస్ వీ చిదంబరేష్, జస్టిస్ సతీష్ నినాన్ లతో కూడిన ధర్మాసనం వివరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ.. మరో రూపంలో కేసు దాఖలు చేయాలని సూచించింది. మరోపక్క తాను ఓ క్రిస్టియన్ యువకుడిని పెళ్లి చేసుకోగా, తన తల్లిదండ్రులు ఇంట్లో బంధించారని ఓ ఆయుర్వేద వైద్యురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుతోనే మత మార్పిడి కేంద్రాలు వెలుగు చూడగా.. తక్షణమే వాటిని గుర్తించి మూసివేయించాలని న్యాయస్థానం కేరళ పోలీస్ శాఖను ఆదేశించింది. కేరళ రాష్ట్రంలోనే ఈ తరహా మత మార్పిడులు, ఘర్ వాపసీలు అధికంగా జరుగుతుండటం గమనార్హం. మతాంతర వివాహాల అనంతరం వారిని ఉగ్రసంస్థల్లోకి పంపిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో జాతీయ దర్యాప్తు సంఘం(ఎన్ఐఏ) రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. దర్యాప్తులో గత ఏడాది వ్యవధిలో ఇటువంటి 90 వివాహాలు జరిగాయని వెల్లడికాగా, వీటిలో 23 ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ అనే ఇస్లామిక్ రాడికల్ గ్రూప్‌కు నేతృత్వంలో జరగటం విశేషం. -
కేరళలో ఘర్‌వాపసీ
సాక్షి, కోచి : కేరళలో ఆరు నెలల కిందట ఇస్లామ్ మతం తీసుకున్న 23 ఏళ్ల యువతి.. తిరిగి మాతృవ్యవస్థలోకి వచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు. కసర్గాడ్ జిల్లాలోని ఉద్మాకు చెందిన అతిరా.. అనే యువతి స్నేహితులు, మరికొందరి ప్రోద్బలంతో మతం మార్చుకుందని.. అయితే అక్కడ ఇమడలేకి తిరిగి హిందూమతంలోకి వచ్చిందని తల్లిదండ్రులు రవీంద్రన్, ఆశా తెలిపారు. కసార్గాడ్లోని ప్రభుత్వ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న తన కూతురు.. ఆరు నెలల కిందట నుంచి కనిపించడం లేదని చెప్పారు. అయితే ఆమె ఒకసారి ఫోన్ చేసి ’నేను మతం మార్చుకున్నాని.. ప్రస్తుతం నా పేరు ఆయేషా‘ అని చెప్పిందన్నారు. అయితే తిరిగి పూర్వాశ్రమంలోకి వచ్చిన అతిరా.. తన స్నేహితురాలు అనీషా, ఆమె సోదరుడు సిరాజ్ బలవంతంతో మతం మార్చుకున్నట్లు చెప్పిందని రవీంద్రన్ తెలిపారు. -
ముఖ్యమంత్రి ‘ఘర్‌వాపసి’!!
బీజేపీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మధ్య రోజురోజుకు అనుబంధం బలపడుతున్నట్టు కనిపిస్తోంది. బిహార్ సీఎం నితీశ్‌పై తాజాగా బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ప్రతిపక్ష ముఖ్యమంత్రులంటే చాలు సహజంగా విరుచుకుపడే అమిత్ షా.. నితీశ్‌కుమార్‌ను విమర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. అవినీతి రహిత స్వచ్ఛమైన పాలనను ఆయన అందిస్తున్నారని, ఏ విషయంలోనూ ఆయన పట్టుబడటం లేదని, అలాంటప్పుడు నితీశ్‌ను విమర్శించాల్సిన అవసరమేముందని తాజాగా ఇండియా టుడే ఎడిటర్స్ రౌండ్‌టేబుల్ సదస్సులో షా పేర్కొన్నారు. నితీశ్‌ను విమర్శించబోనని చెప్పిన ఆయన అదేసమయంలో లాలూ ప్రసాద్ అవినీతిపరుడంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మొత్తానికి ఒకప్పటి బీజేపీ దోస్త్ అయిన నితీశ్‌కుమార్ ఆ పార్టీలో మోదీ ఎదుగుదలను వ్యతిరేకిస్తూ తెగదెంపులు చేసుకున్నారు. కానీ ఇటీవల ఆయన మోదీ ప్రశంసకుల్లో ఒకరిగా మారిపోయారు. మోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దును నితీశ్ గట్టిగా సమర్థించి.. ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ నితీశ్-బీజేపీ మధ్య స్నేహం చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ‘ఘర్‌వాపసి’ చేసి తిరిగి ఎన్డీయే గూటిలో చేరవచ్చునని ఊహాగానాలు వస్తున్నాయి. -
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న "ఘర్ వాపసీ"
-
'సామాజిక అలజడి సృష్టించడమే వారి లక్ష్యం'
పాట్నా: హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారంతా తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాలంటూ ఉత్తరాదిలో సంఘ్ పరివార్ చేపట్టిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమంపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మండిపడ్డారు. హిందూవులను బలవంతంగా మతం మార్చవద్దని మైనార్టీలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన విజ్ఞప్తిని నితీష్ తప్పుబట్టారు. మోహన్ భగవత్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఘర్ వాపసీ కార్యక్రమంతో దేశంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నారు. జనతా దళ్ యునైటెట్ మరియు ఇతర పార్టీలు ఆర్ఎస్ఎస్ వైఖరిని సమర్ధించకపోయినా.. బీజేపీ మాత్రం అందుకు వంత పాడుతుందన్నారు.