'సామాజిక అలజడి సృష్టించడమే వారి లక్ష్యం'
పాట్నా: హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారంతా తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాలంటూ ఉత్తరాదిలో సంఘ్ పరివార్ చేపట్టిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమంపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మండిపడ్డారు. హిందూవులను బలవంతంగా మతం మార్చవద్దని మైనార్టీలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన విజ్ఞప్తిని నితీష్ తప్పుబట్టారు. మోహన్ భగవత్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఘర్ వాపసీ కార్యక్రమంతో దేశంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నారు. జనతా దళ్ యునైటెట్ మరియు ఇతర పార్టీలు ఆర్ఎస్ఎస్ వైఖరిని సమర్ధించకపోయినా.. బీజేపీ మాత్రం అందుకు వంత పాడుతుందన్నారు.