‘వారిని అరెస్టు చేస్తా.. నువ్వు నా గదిలోకి రా’ | Cop asks rape survivor for sex to arrest rapists | Sakshi
Sakshi News home page

‘వారిని అరెస్టు చేస్తా.. నువ్వు నా గదిలోకి రా’

Published Thu, Jun 22 2017 9:21 AM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

‘వారిని అరెస్టు చేస్తా.. నువ్వు నా గదిలోకి రా’ - Sakshi

‘వారిని అరెస్టు చేస్తా.. నువ్వు నా గదిలోకి రా’

 రాంపూర్‌: కష్టం చెప్పుకునేందుకు వెళ్లిన ఓ మహిళను ఖాకీ కామంతో చూశాడు. ముందు తన కోరిక తీరిస్తే ఆ తర్వాత ఆమె కష్టాన్ని తీరుస్తానని అన్నాడు. అప్పటికే లైంగిక దాడి బాధితురాలు కావడంతో తీవ్ర మనస్థాపంతో ఇంటికెళ్లిన ఆ మహిళ తిరిగొచ్చి ఆ పోలీసుకు తగిన బుద్ది చెప్పింది. సాక్షాధారాలతో సహా ఆ పోలీసును నడి బజారులో నిలబెట్టింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నగరంలో ఓ 37 ఏళ్ల మహిళ ఉంది. ఆమెపై ఈ ఏడాది ఫిబ్రవరి 12న అమీర్‌ అహ్మద్‌ (55), సత్తార్‌ అహ్మద్‌ (45) అనే వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఫిబ్రవరి 12న బంధువుల ఇంటికెళ్లి తిరిగొస్తున్న ఆ మహిళను వారు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా తొలుత పోలీసులు పట్టించుకోకపోవడంతో మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించింది. దీంతో వారిపై పలు అభియోగాలు నమోదు చేశారు. కానీ, వారిని స్థానిక పోలీసులు మాత్రం అరెస్టు చేయలేదు. దీంతో వారు స్వేచ్ఛగా తిరుగుతూ ఆ మహిళకు ప్రమాదకరంగా తయారయ్యారు. ఇదే విషయాన్ని జై ప్రకాశ్‌ సింగ్‌ అనే ఎస్సైకి బాధితురాలు చెప్పగా అతడు లక్ష్య పెట్టలేదు.

‘వారిని అరెస్టు చేయాలని ఎస్సై దగ్గరకు ఎప్పుడు వెళ్లినా అతడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టేవాడు. ముందు నా లైంగిక వాంచను తీర్చు. ఆ తర్వాత వారిని అరెస్టు చేస్తాను అనేవాడు. నాకు ఫోన్‌ చేసి నా గదిలోకి ఒంటరిగా రా.. నువ్వెప్పుడు వస్తే ఆ తర్వాతే వారిని అరెస్టు చేస్తా అనే వాడు’ అని ఎస్సై దుర్మార్గాన్ని చెప్పింది. ఆ తర్వాత ఇంటికెళ్లిన తను ఈసారి సీక్రెట్‌గా ఆ ఎస్సై మాట్లాడే మాటలన్నీ కూడా రికార్డు చేసి సీడీ రూపంలో ఎస్పీకి ఇవ్వడంతో అతడి ఆటకట్టయింది. ప్రస్తుతం ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement