ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు బయటపడ్డాయి. సోమవారం ఉదయం నాటికి కరోనా కేసుల సంఖ్య 415కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుతం కరోనా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మహారాష్ట్రలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న పిలిఫ్పిన్స్ దేశస్తురాలు ఆదివారం రాత్రి కన్నుమూసింది. ( లాక్‌డౌన్: వారికి గుడ్‌న్యూస్! )
ఐసీఎమ్‌ఆర్ కరోనా స్టాటస్ అప్‌డేట్!
దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3కు చేరింది. అలాగే వైరస్ బాధితుల సంఖ్య 89కు పెరిగింది. నిన్న రాత్రి నుంచి 15 కొత్త కేసులు గుర్తించినట్టు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. కేరళలో 64, ఢిల్లీలో 30, రాజస్థాన్‌లో 28, తెలంగాణ 27, ఉత్తరప్రదేశ్ 27, కర్ణాటక 27, గుజరాత్‌లో 18 మందికి వైరస్ సోకింది. కర్ణాటకలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో కేసుల కోసం ప్రతీ జిల్లాలోనూ ఓ ఆసుపత్రిని కేటాయించింది ప్రభుత్వం.
చదవండి: లాక్‌డౌన్ అంటే... ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment