
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పలు బిజినెస్ స్కూళ్లలోకి ప్రవేశాన్ని కల్పించే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌లో కొనసాగుతుందని ఆ పరీక్ష నిర్వహించే గ్లోబల్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీఎమ్‌ఏసీ) స్పష్టం చేసింది. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు చెప్పింది. బిజినెస్ స్కూళ్లను, అభ్యర్థులను సాధికారత వైపు నడిపే ప్రత్యేక ఆన్‌లైన్ టెస్టింగ్ సొల్యూషన్‌ను తాము పరిశీలిస్తున్నట్లు జీఎంఏటీ హెడ్ వినీత్ చాబ్రా చెప్పారు. జీమ్యాట్ ఆన్‌లైన్‌లో ఇచ్చే అసెస్మెంట్లు కఠినంగానే స్థాయికి తగినట్లు ఉంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,300 గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూళ్లు 7 వేలకు పైగా ప్రోగ్రాములతో జీమ్యాట్ సెలక్షన్ క్రైటీరియాను అంగీకరించాయి.
ఇది చదవండి: అంతర్జాతీయ వర్సిటీల ఉచిత ఆన్‌లైన్ కోర్సులు
Comments
Please login to add a commentAdd a comment