న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి వేగంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజులగా రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 18,522 కొత్త కరోనా కేసులు, 418 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 5,66,840 మంది కరోనా బారిన పడగా, 16,893 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాటికి 3,34,822 మంది కరోనా పోరాడి కోలుకోగా, ప్రస్తుతం 2,15, 125 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రతా అధికంగా ఉంది. సోమవారం 5 వేల కేసులు నమోదవ్వగా మొత్తం కేసుల సంఖ్య 1,69,883కు చేరింది. ఢిల్లీలో 2,084 కేసులు వెలుగు చూడగా మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 85 వేలకు చేరింది. మరోవైపు దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు(మంగళవారం) సాయంత్రం జాతినుద్ధేశించి మాట్లాడనున్నారు. (మళ్లీ లాక్‌డౌన్.. సిద్ధంగా ఉన్నారా?)
చదవండి : తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా
Comments
Please login to add a commentAdd a comment