
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనావైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా సరాసరిగా మూడు వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,320 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో శనివారం ఉదయం నాటికి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,662కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 95 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 1981కి చేరింది. ఈ మహమ్మారి నుంచి కోలుకొని 17,847 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో ప్రస్తుతం 39,834మంది చికిత్స పొందుతున్నారు.
(చదవండి : కరోనా: అందుకే మనదేశంలో మరణాలు తక్కువ)
ఇక అత్యధికంగా మహారాష్ట్రంలో 19,063 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 7402, ఢిల్లీలో 6318, మధ్యప్రదేశ్‌లో 3341, రాజస్తాన్‌లో 3579, తమిళనాడులో 6009, ఉత్తరప్రదేశ్‌లో 3214 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment