డాక్టర్‌తో పాటు మరో 11 మంది నర్సులకు కరోనా | Coronavirus: Another Doctor And 11 Nurses Tested Positive In Delhi Hospital | Sakshi
Sakshi News home page

డాక్టర్‌తో పాటు మరో 11 మంది నర్సులకు కరోనా

Published Tue, Apr 7 2020 9:04 AM | Last Updated on Tue, Apr 7 2020 9:04 AM

Coronavirus: Another Doctor And 11 Nurses Tested Positive In Delhi Hospital - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వేగంగా ప్రబలుతోంది. సామాన్యులతో పాటు కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. గత వారం రోజల క్రితం ప్రభుత్వం క్యాన్సర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలికి కరోనా సోకిన విషయం తెలిసిందే. విదేశాలను నుంచి సోదరుడి ద్వారా ఆమెకు ఈ వైరస్‌ సోకింది.  ఆ తర్వాత అదే అస్పత్రిలో పనిచేస్తున్న మరో ఆరుగురు నర్సులకు కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఆ ఆస్పత్రిని మూసేసింది.
(చదవండి: పరీక్షలు చేయించుకోకపోతే.. హత్యాయత్నం కేసు)

తాజాగా అదే అస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌తో పాటు మరో 11 మంది నర్సులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ ఆస్పత్రిలో కరోనా బాధితుల సంఖ్య 18కి చేరింది. క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 19 మంది రోగుల రక్త నమూనాలను కూడా ల్యాబ్‌కు పంపారు. ఈ నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. క్యాన్సర్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న 45 మంది సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్‌ జంటకు కూడా కరోనా వైరస్‌ సోకింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ రోగి ద్వారా వారికి ఈ వైరస్‌ సోకింది. ఇక ఢిల్లీలో కరనా బాధితుల సంఖ్య సోమవారం సాయంత్రం నాటికి 523కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. దేశ వ్యాప్తంగా 4,281 కరోనా కేసులు నమోదు కాగా, 111 మంది మృతి చెందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement