ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో భారీగా కరోనా మరణాలు సంభవించాయి. ఒక్క రోజులో ఏకంగా 2003 మంది ఈ మహమ్మారి కారణంగా బలవ్వడం అందిరినీ షాక్‌కు గురిచేసింది. దేశంలో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 12 వేలకు చేరువలో ఉంది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,974 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 3 లక్షల 54 వేల మార్క్‌ని కరోనా పాజిటివ్ కేసులు దాటాయి. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,86,935 మంది మహమ్మారి కరోనా నుంచి కోలుకోగా.. 11,903 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,55,227 కరోనా యాక్టీవ్ కేసులు దేశంలో ఉన్నాయి. (ప్రతీ అయిదుగురిలో ఒకరికి కోవిడ్ ముప్పు)
ఇక ప్రపంచవ్యాప్తంగానూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82.63 లక్షలకుపైగా చేరుకుంది. వైరస్ బారినపడి 4.46 లక్షల మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 43.21 లక్షల మంది కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు అమెరికాలో 22లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా.. 1,19,132 మంది మృత్యువాత పడ్డారు. అమెరికా తర్వాత బ్రెజిల్(9,28,834), రష్యా (5,45,458) దేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదుకాగా ఆ తర్వాతి నాలుగో స్థానంలో భారత్ కొనసాగుతోంది. (కేరళ ఆయుర్వేదం గెలిచింది!)
Comments
Please login to add a commentAdd a comment