మృతి చెందిన కాకులు
సాక్షి, చెన్నై(తమిళనాడు): పనపాక్కం సమీపంలో రోజురోజుకూ కాకుల మృతి పెరుగుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇవి ఆకలితో చనిపోతున్నాయా లేదా వ్యాధి బారిన పడి చనిపోతున్నాయా అనే విషయంపై స్పష్టత రావడం లేదు. రాణిపేట జిల్లా పనపాక్కం సమీపంలోని పన్నియూర్ గ్రామంలో 800 మందికిపైగా ప్రజలు జీవిస్తున్నారు. ఈప్రాంతంలో ఉన్న ప్రజలు ముఖ్య జీవనాధారం వ్యవసాయం.
ఈ గ్రామంలో గత 1వ తేది సాయంత్రం 5 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న కులత్తుమేడు ప్రాంతంలో అకస్మాత్తుగా పదికి పైగా కాకులు మృతి చెంది పడి ఉన్నాయి. దీన్ని గమనించిన ఆ ప్రాంత ప్రజలు కరోనా నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉండడంతో ప్రజలు ఎవరూ బయటకు రాకపోవడంతో ఆహారం లేక కాకులు చనిపోయి ఉండవచ్చని సాధారణంగా భావించారు. కాకులు చనిపోవడాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ స్థితిలో తర్వాత రోజు సాయంత్రం అదే ప్రాంతంలో ఉన్న ప్రజలు నివాస గృహాలపై నీరసంగా వాలిన కాకులు, అకస్మాత్తుగా ఒకదాని తర్వాత ఒకటి పెద్దసంఖ్యలో మృతి చెందుతున్నాయి. శనివారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. (ఎంత నమ్మకం ఉంటే ఇలా చేస్తారు!)
Comments
Please login to add a commentAdd a comment