
కోపంతో సీనియర్‌ను కాల్చాడు
రాంచీ: ఓ చిన్న గొడవతో కోపోద్రిక్తుడైన ఓ జవాను తన సీనియర్‌ను తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. జార్ఖండ్‌లోని లతేహార్‌లో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో బుధవారం ఈ ఘటన జరిగింది.
మహిపాల్ అనే కానిస్టేబుల్, సంజయ్ అనే హెడ్‌కానిస్టేబుల్ మధ్య జరిగిన చిన్న గొడవ జరిగిందని, సహనం కోల్పోయిన మహిపాల్.. రైఫిల్‌తో సంజయ్‌ని కాల్చాడని, ఆ తర్వాత అదే తుపాకీతో తనను కాల్చుకున్నాడని అధికారులు వెల్లడించారు. కావాలనే కాల్పులు జరిపాడా లేదా మిస్‌ఫైర్ అయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.