'ఇండియాను హిందూ దేశంగా ప్రకటించండి'
ముంబయి: భారత్ను హిందూ దేశంగా ప్రకటించాలని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆదివారం ముంబయిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ అంతకంటే ప్రత్యామ్నాయం లేదని అన్నారు. 'భారత్ ను హిందూ రాష్ట్రం(దేశంగా) ప్రకటించడం తప్ప మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. చాలా కాలంగా భారతీయులంతా లౌకికవాదం అని చెబుతూ వస్తున్నారు. దానివల్ల ఇక్కడి హిందువులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అది(లౌకికత్వం) చాలు ఆపేయండి' అని ఠాక్రే చెప్పారు.
కశ్మీర్ అల్లర్లను ఆపేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ఇబ్బందులు పడుతున్న బాధలను గుర్తించలేదని ఆరోపించారు. 'కశ్మీర్ అల్లర్లకు ఎవరు కారణం? అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. హిందువులను కొడుతున్నారు. జవాన్లపై దాడులు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక అంతా మారుతుందని ప్రతి ఒక్కరు ఆశించారు' అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.