న్యూఢిల్లీ: దేశంలో లాక్ డౌన్ ఎత్తేసిన మరుసటి రోజు దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా కేసుల్లో పుట్టిల్లు వుహాన్‌ను దాటేసింది. సరిగ్గా రెండు వారాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, ముంబైని కరోనా వ్యాప్తిలో మించిపోయింది. సోమవారం ఉదయానికి ఢిల్లీలో నమోదైన కరోనా కేసులు 70,390. ఇదే సమయానికి ముంబైలో ఉన్న కేసుల సంఖ్య 69,529. ఢిల్లీ కరోనా హాట్‌స్పాట్‌గా మారడం వెనుక ఏం జరిగిందో పాయింట్ల రూపంలో... (‘గల్వాన్ లోయ మాదే.. చైనా అద్భుత డిమాండ్’)
1. మే 29 నుంచి ఢిల్లీలో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైనే నమోదవుతూ వస్తున్నాయి. మే 31ను బేస్ లైన్ గా తీసుకుంటే, అప్పటిదాకా నమోదవుతున్న కేసులు రోజుకు మూడింతలు పెరిగాయి.
2. జూన్ రెండో వారం దాకా ముంబైలో విపరీతంగా కేసులు పెరిగాయి. ఇదే టైంలో ఢిల్లీ కరోనా వ్యాప్తి 5.25 శాతం కాగా, ముంబైలో 3 కంటే తక్కవ.
3. దీంతో అందరూ జులైలో ముంబైని, ఢిల్లీ దాటేస్తుందని భావించారు. కానీ, ఓ వారం ముందే ఢిల్లీ ఆ స్థాయిని చేరుకుంది. జూన్ 23న ఢిల్లీలో 3947 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచం మొత్తం మీద కూడా ఒకే నగరంలో ఇన్ని కేసులు బయటపడలేదు. (పతంజలి ‘కరోలిన్’పై పెను దుమారం)
4. జనాభాలో ముంబై కంటే ఢిల్లీని ముందుంది. ఆర్థిక రాజధాని జనాభా 1.25 కోట్లు కాగా ఢిల్లీ జనాభా 1.68 కోట్లు. అయితే, ముంబై కంటే ఢిల్లీలోనే ఎక్కువ టెస్టులు జరిగాయి.
5. ఢిల్లీలో ప్రతి పది లక్షల మందికి 22,142 మందికి కరోనా టెస్టులు జరిగాయి. ముంబైలో ఈ సంఖ్య 22,668గా ఉంది. ఇదే టైంలో ముంబైలో పాజిటివ్ రేటు 23 శాతం కాగా ఢిల్లీలో కేవలం 17 శాతం మాత్రమే. కొన్ని రోజులుగా ఈ పరిస్థితి మారింది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ పాజిటివ్ రేటు సమానమైంది.
6. జనాభాతో పోల్చితే ఢిల్లీలో తక్కువ కేసులు ఉన్నట్లే లెక్క. ఇక్కడ 10 లక్షల మందికి 347 కేసులు నమోదయ్యాయి. ముంబైలో ప్రతి పది లక్షల మందికి 5,478 కేసులు బయటపడ్డాయి.
7. ముంబైలో కంటే ఢిల్లీలో మరణాలు, రికవరీల రేటు ఎక్కువగా ఉంది. ముంబైలో 28,548 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో ఈ సంఖ్య 26,588గా ఉంది.
8. ముంబైలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య జూన్‌లో తగ్గుముఖం పట్టింది. గత వారం కేసుల పెరుగుదల 2.7 శాతం నుంచి 2.4 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా రోజూ బయటపడుతున్న కేసుల రేటు 3.3 శాతంగా ఉంది. ఢిల్లీలో కేసుల డబులింగ్ రేటు 12కి తగ్గింది.
9. ఢిల్లీ వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 45 లక్షల ఇళ్లలో కేసుల పరీక్ష చేయాలని నిర్ణయించింది. ఇది రెండు దశల్లో జరగనుంది. జూన్ 30 నాటికి కంటైన్‌మెంట్ జోన్లలో, మిగతా నగరానికి జులై 6 కల్లా పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment