లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ: ఢిల్లీ పోలీసులు అరుదైన ఘనత సాధించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించడంతో ఆగ్నేయ ఢిల్లీ పోలీసులకు ఈ ఘనత దక్కింది. నవంబర్ 27న యాక్సిస్ బ్యాంకుకు చెందిన రూ. 22. 49 కోట్లను క్యాష్ వ్యాన్ డ్రైవర్ దొంగిలించగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ నగదును రికవరీ చేశారు.
ఫిర్యాదు చేసిన 10 గంటల్లో డబ్బును రికవరీ చేయడం విశేషం. మొత్తం డబ్బులో ఓ పదివేలను మాత్రం డ్రైవర్ ఆ పది గంటల్లో ఖర్చు చేశాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు దీనిని అతిపెద్ద మనీ రికవరీగా గుర్తించారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
DP enters the Lima Book of Records for making India's largest ever cash recovery of ₹22.49 Crores of stolen money. pic.twitter.com/aXcOoHD3ky
— BS Bassi (@BhimBassi) January 2, 2016