భార్య చదువుకున్నా జీవనభృతి ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: భార్య చదువుకున్నంత మాత్రాన మధ్యంతర జీవనభృతిని నిరాకరించడం కుదరదని ఢిల్లీలోని సెషన్స్‌కోర్టు తీర్పునిచ్చింది. గృహహింస కేసులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన అదనపు సెషన్స్ జడ్జీ వివేక్ గులియా, దిగువ మేజిస్ట్రియల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేశారు. మధ్యంతర భృతి పొందడానికి భార్య నిరాశ్రయురాలు కావాల్సిన అవసరం లేదన్నారు.
భార్యకు నెలకు రూ.3,000 మధ్యంతర భృతి చెల్లించాల్సిందిగా ఆమె భర్తను ఆదేశించారు. 2015 జనరిలో పిటిషనర్‌కు వివాహమైన తర్వాత అదనపు కట్నం తేవాల్సిందిగా ఆమెను భర్త, అతని కుటుంబ సభ్యులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. దీంతో పెళ్లైన అయిదు నెలలకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత మధ్యంతర భృతి కోసం మేజిస్ట్రియల్ కోర్టును ఆశ్రయించగా, పిటిషనర్‌కు తనను తాను పోషించుకోగల సామర్థ్యం ఉందని పటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె సెషన్స్‌కోర్టును ఆశ్రయించారు.