జీవోఎంకు సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదన
ఆంటోనీ, షిండే, మొయిలీ, జైరాంలతో విడివిడిగా భేటీలు
శాంతి భద్రతలు సహా, ప్రధాన విభాగాల్లో కేంద్ర అజమాయిషీ ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రుల భద్రతను దష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌ను కేంద్రపాలన కిందకు తేవాలని రాష్ట్ర విభజనకు ఏర్పాటైన మంత్రుల బందానికి(జీవోఎం) సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు విన్నవించారు. మంత్రుల బందం సభ్యులు ఏకే ఆంటోనీ, షిండే, మొయిలీ, జైరాం రమేష్‌లతో సీమాంధ్ర మంత్రులు శుక్రవారం భేటీ అయ్యారు. జీవోఎంను కలిసిన వారిలో కేంద్ర మంత్రులు పళ్లంరాజు, కావూరు సాంబశివరావు, కిశోర్ చంద్రదేవ్, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. విభజనపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ప్రకటిస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర సమస్యలపై జీవోఎంకు సీమాంధ్ర మంత్రులు మెమోరాండం సమర్పించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, భూ కేటాయింపులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లను దేశ రాజధాని ఢిల్లీ తరహాలో కేంద్ర పాలన కింద నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రులు ప్రతిపాదించారని తెలిసింది. సీమాంధ్రుల ఆస్తుల రక్షణ, నివాస భద్రతపై ఏమాత్రం రాజీ పడే ధోరణిలో వ్యవహరించరాదని, దానికోసం తీసుకుంటున్న చర్యలు ముందుగానే వెల్లడించాలని జీవోఎంను కోరారని సమాచారం. సీవూంధ్రలో నూతన రాజధాని నిర్మాణానికి సమకూర్చే నిధులపైనా స్పష్టత ఇవ్వాలని, నదీజలాల్లో, విద్య, ఉద్యోగాల్లో సీమాంధ్రులకు అన్యాయం జరక్కుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగే హైదరాబాద్‌పై తెలంగాణ అజమాయిషీని సీమాంధ్రులు ఏమాత్రం ఒప్పుకోరని వారు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని విన్నవించారు.
నిధుల్లో జాప్యం వద్దు
నూతన రాజధాని ఏర్పాటుపై ప్రధానంగా చర్చించిన వుంత్రులు పెద్ద మొత్తంలో నిధులు డిమాండ్ చేసినట్లు సమాచారం. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కొత్త రాజధానులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని చెప్పిన కేంద్రం... 13 ఏళ్లయినా 40 శాతం నిధులు కూడా విడుదల చేయలేదని వారు ఈ సందర్భంగా మంత్రుల బందం సభ్యుల దష్టికి తీసుకొచ్చారు. తవు రాష్ట్ర ఏర్పాటులో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా కేంద్రం ముందుగానే హామీ ఇవ్వాలని కోరారు. ఇక హైదరాబాద్‌లోని ప్రధాన ఆదాయ వనరులను రెండు రాష్ట్రాలకు ఎలా ఎంత కాలం పంచుతారో ముందే చెప్పాలని విన్నవించారు.
హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పాలన
Published Sat, Oct 19 2013 1:40 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement