
సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ: మోదీ
పన్ను చెల్లించకుండా దాచిన డబ్బు, ఆదాయ వివరాలను ప్రతి ఒక్కరూ తెలియజేయాలని, ఇందుకు సెప్టెంబరు 30 ఆఖరు తేదీ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
న్యూఢిల్లీ: పన్ను చెల్లించకుండా దాచిన డబ్బు, ఆదాయ వివరాలను ప్రతి ఒక్కరూ తెలియజేయాలని, ఇందుకు సెప్టెంబరు 30 ఆఖరు తేదీ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పన్ను ఎగవేతదారులకు ఇదే ఆఖరి అవకాశమని, వివరాలు తెలియజేయకుంటే చర్యలు తప్పవని మోదీ హెచ్చరించారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం స్వచ్ఛ భారత్కు విరాళాలు ఇస్తున్నారని, అలాంటిది పన్నులు ఎగవేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.
ప్రజాస్వామ్యమే మన బలమని, ఇది ప్రతి పౌరుణ్ని శక్తిమంతుణ్ని చేస్తుందని మోదీ అన్నారు. దేశాభివృద్ధి కోసం మన శాస్త్రవేత్తలు, రైతులు నిరంతరం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాల్సిన అవసరముందని సూచించారు. యోగా డే సందర్భంగా దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది పాల్గొన్నారని మోదీ చెప్పారు.