MannKiBaat
-
'చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించబోం'
విశ్వాసం పేరిట హింస సరికాదు మన్‌కీబాత్‌లో స్పష్టం చేసిన ప్రధానమంత్రి న్యూఢిల్లీ: డేరా స్వచ్ఛ సౌధా అధినేత గుర్మీత్ రాంరహీం సింగ్‌కు శిక్ష నేపథ్యంలో హరియాణలో తలెత్తిన హింసాకాండను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు. విశ్వాసం పేరిట హింసకు దిగుతామంటే ఎంతమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. వర్గ, రాజకీయ, వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా దాడులకు దిగుతామంటే అంగీకరించబోమన్నారు. 'చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా.. హింసకు ఎవరు పాల్పడినా.. ఎంతటివారినైనా వదిలిపెట్టబోం' అని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పండుగ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ప్రజల్లో ఆందోళన రేకెత్తించిందన్నారు. 'మన్‌కీ బాత్' రేడియో కార్యక్రమంలో భాగంగా దేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వినాయకచవితి వంటి పండుగలను నిర్వహించుకోవడం ఆనందం కలిగిస్తోంది. స్వచ్ఛత సేవ. గాంధీ జయంతి సందర్భంగా పరిశుభ్రత కోసం మనందరం మరో ఉద్యమాన్ని ప్రారంభిద్దాం. -
బినామీ చట్టంలో మార్పులు తప్పవు: మోదీ
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకాలు ప్రారంభమయ్యాయి. ఈ పథకాలను ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన మాసాంతపు రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా తెలియజేశారు. వీటి ద్వారా చిన్నచిన్న వ్యాపారులు, వినియోగదారులు లబ్ధి పొందనున్నట్లు మోదీ చెప్పారు. దీనిని దేశ ప్రజలకు క్రిస్మస్ బహుమానంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం మన్ కీబాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలకు తొలుత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలిపారు. 2017 అందరినీ సంతృప్తి పరుస్తుందని అన్నారు. ఇటీవల నగదు రహిత లావాదేవీలు 200-300శాతం పెరిగాయని చెప్పారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సహకానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అసోం ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల విషయంలో బాగా కృషి చేస్తోందని కొనియాడారు. అవినీతిని పూర్తిగా పెకలించేందుకు బినామీ ప్రాపర్టీ చట్టంలో సమూల మార్పులు చేస్తామని మోదీ స్పష్టం చేశారు. అవినీతి అంతమొందించే విషయంలో తాను తీసుకున్న ఈ నిర్ణయం అంతం కాదని కేవలం ఆరంభం మాత్రమేనని చెప్పారు. -
సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ: మోదీ
న్యూఢిల్లీ: పన్ను చెల్లించకుండా దాచిన డబ్బు, ఆదాయ వివరాలను ప్రతి ఒక్కరూ తెలియజేయాలని, ఇందుకు సెప్టెంబరు 30 ఆఖరు తేదీ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పన్ను ఎగవేతదారులకు ఇదే ఆఖరి అవకాశమని, వివరాలు తెలియజేయకుంటే చర్యలు తప్పవని మోదీ హెచ్చరించారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం స్వచ్ఛ భారత్‌కు విరాళాలు ఇస్తున్నారని, అలాంటిది పన్నులు ఎగవేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్యమే మన బలమని, ఇది ప్రతి పౌరుణ్ని శక్తిమంతుణ్ని చేస్తుందని మోదీ అన్నారు. దేశాభివృద్ధి కోసం మన శాస్త్రవేత్తలు, రైతులు నిరంతరం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాల్సిన అవసరముందని సూచించారు. యోగా డే సందర్భంగా దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది పాల్గొన్నారని మోదీ చెప్పారు.