
'చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించబోం'
డేరా స్వచ్ఛ సౌధా అధినేత గుర్మీత్ రాంరహీం సింగ్‌కు శిక్ష నేపథ్యంలో హరియాణలో తలెత్తిన హింసాకాండను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు.
విశ్వాసం పేరిట హింస సరికాదు
మన్‌కీబాత్‌లో స్పష్టం చేసిన ప్రధానమంత్రి
న్యూఢిల్లీ: డేరా స్వచ్ఛ సౌధా అధినేత గుర్మీత్ రాంరహీం సింగ్‌కు శిక్ష నేపథ్యంలో హరియాణలో తలెత్తిన హింసాకాండను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు. విశ్వాసం పేరిట హింసకు దిగుతామంటే ఎంతమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. వర్గ, రాజకీయ, వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా దాడులకు దిగుతామంటే అంగీకరించబోమన్నారు. 'చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా.. హింసకు ఎవరు పాల్పడినా.. ఎంతటివారినైనా వదిలిపెట్టబోం' అని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పండుగ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ప్రజల్లో ఆందోళన రేకెత్తించిందన్నారు. 'మన్‌కీ బాత్' రేడియో కార్యక్రమంలో భాగంగా దేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
- పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వినాయకచవితి వంటి పండుగలను నిర్వహించుకోవడం ఆనందం కలిగిస్తోంది.
- స్వచ్ఛత సేవ. గాంధీ జయంతి సందర్భంగా పరిశుభ్రత కోసం మనందరం మరో ఉద్యమాన్ని ప్రారంభిద్దాం.