రాహుల్‌కు ఎల్టీటీఈ స్వాగతం? | Did rahul gandhi welcomed by LTTE leftovers at chennai | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు ఎల్టీటీఈ స్వాగతం?

Published Sat, Oct 8 2016 10:39 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

రాహుల్‌కు ఎల్టీటీఈ స్వాగతం?

రాహుల్‌కు ఎల్టీటీఈ స్వాగతం?

తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరి.. గత 18 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ప్రైవేటు విమానంలో చెన్నై వెళ్లారు. అక్కడ ఆయన అపోలో ఆస్పత్రి వైద్య బృందంతో చర్చించి.. పావుగంట పాటు ఆస్పత్రిలోనే గడిపారు. బయటకు వచ్చిన తర్వాత.. జయలలిత కోలుకుంటున్నట్లు వైద్యులు తనకు చెప్పారని అన్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అసలు విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికింది ఎవరు? ఆయనను విమానాశ్రయం నుంచి నేరుగా అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చింది ఎవరు?

ఈ విషయంలో బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యం స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు విమానంలో వచ్చిన రాహుల్ గాంధీని స్వాగతించినది.. ఎల్టీటీఈలో మిగిలిపోయిన ప్రముఖ నాయకులేనని ఆయన అన్నారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండా.. 'బుద్ధూ' అని ఆయనను సంబోధించారు. శశికళా నటరాజన్‌తో ఉన్న సంబంధాల దృష్ట్యానే వాళ్లు వచ్చి రాహుల్‌కు స్వాగతం పలికారని చెప్పారు. ఈ విషయమై ఆయన శనివారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. అయితే దీనికి కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎవరూ ఇంకా స్పందించలేదు.

 

చెన్నై అపోలో వైద్యులతో రాహుల్ గాంధీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement