లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో దిగ్ర్భాంతికర ఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను విమర్శించినందుకు ఓ దివ్యాంగునిపై బీజేపీ నేత భౌతిక దాడికి పాల్పడ్డారు. యూపీలోని సంభాల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ఘటన జరిగింది. కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితుడు మనోజ్ గుజ్జార్ తాను మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు ఓటు వేస్తానని చెబుతూ మోదీ, యోగిలను విమర్శించడంతో అక్కడే ఉన్న బీజేపీ నేత మహ్మద్ మియాన్‌ను కర్రతో కొట్టి హింసించాడు.
చందుసి తెహిసిల్‌లోని ఖర్జా గేట్ ప్రాంతానికి చెందిన గుజ్జార్‌ను బీజేపీ నేత కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మియన్‌పై అస్మోలి పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఓపెన్ చేశారని, ఆయనకు నేరచరిత్ర ఉందని సంభాల్ ఎస్పీ వెల్లడించారు. కాగా సీనియర్ బీజేపీ నేతలపై గుజ్జర్ అమర్యాదకరంగా మాట్లాడటంతో తాను సహనం కోల్పోయి అతడిపై దూషణలకు దిగానని, దీనిపై అతనికి బహిరంగ క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధమని మియన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment