differently abled
-
డిజిటల్ పేమెంట్స్‌లో మార్పులు.. ఆర్బీఐ ఆదేశం
ముంబై: వైకల్యంతో బాధపడే కస్టమర్లు సులభంగా సేవలు పొందే విధంగా బ్యాంక్‌లు తమ చెల్లింపుల వ్యవస్థలను సమీక్షించుకోవాలని ఆర్బీఐ కోరింది. సమాజంలోని అన్ని వర్గాలు, దివ్యాంగులు సైతం డిజిటల్ చెల్లింపులను అనుసరిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.‘‘మరింత మెరుగైన సేవలను పొందేందుకు వీలుగా చెల్లింపుల వ్యవస్థల భాగస్వాములు (పీఎస్పీలు/బ్యాంక్‌లు/నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు) తమ చెల్లింపుల వ్యవస్థలు/పరికరాలను సమీక్షించాలి. దివ్యాంగులు సైతం సులభంగా వినియోగించుకునే విధంగా ఉండాలి. సమీక్ష అనంతరం దివ్యాంగులు సైతం వినియోగించుకునేందుకు వీలుగా.. బ్యాంక్‌లు, నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు తమ వ్యవస్థల్లో, పీవోఎస్ మెషిన్లలో అవసరమైన మార్పులు చేయాలి’’అని ఆర్బీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది. -
ఇండిగో, కోల్‌కతా ఎయిర్ పోర్ట్ నిర్వాకం: మహిళా పారా అథ్లెట్ ఆగ్రహం
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇండిగోకు సంబంధించి మరో అనుచిత ఘటన వివాదాన్ని రేపింది. అలాగే కోల్‌కతా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది దివ్యాంగ మహిళ పట్ల అమానుషంగా వ్యవరించారు. దీనికి సంబంధించిన ఘటనను ఆమె ట్విటర్ షేర్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో వికలాంగురాలైన (వీల్‌చైర్ యూజర్ కూడా) తనను మూడుసార్లు లేచి నిలబడాలంటూ కోరారని న్యాయ విద్యార్థిని ఆరూషి సింగ్ ట్వీట్ చేశారు. మొదట ఆమె నన్ను లేచి కియోస్క్‌లోకి రెండు అడుగులు వేయమని చెప్పింది. పుట్టుకతోనే తనకు వైక్యల్యంఉందని తన వల్ల కాదని చెప్పినా. వినిపించుకోకుండా రెండు నిమిషాలే అయిపోతుంది అంటూ వేధించారని ఆమె ఆరోపించారు. దీంతో తాను భయంతో వణికి పోయానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు 20 నిమిషాలు లేటైందని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి జరిగినా, ఇండిగోకు ఇంకా బుద్ధి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు వైకల్యం ఉన్న ప్రయాణీకుల పట్ల వ్యవహరించాల్సిన తీరును పునరాలోచించాల్సిన అవసరం ఉందని సింగ్ కోరారు. ఈ ఘటనపై సిఐఎస్ఎఫ్, కోల్‌కతా విమానాశ్రయం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయ లేదు. Yesterday evening during the security clearance at Kolkata airport, the officer asked me (a wheelchair user) to stand up, not once but thrice. First she asked me to get up and walk two steps into the kiosk. (1/1) — Arushi Singh (@singhharushi) February 1, 2024 ఇది ఇలా ఉంటే ఇండిగోకు సంబంధించి తాజా సంఘటన కలకలం రేపింది. వీల్ చెయిర్ విషయంలో ఇండిగో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారంటూ ఆసియా పారా గేమ్స్ పతక విజేత , పారా అథ్లెట్ సువర్ణ రాజ్ ఆరోపణలు గుప్పించారు. దివ్యాంగురాలైన తనకు విమానం డోర్ దగ్గర తన వీల్ చెయిర్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశారని మండి పడుతూ తన అనుభవాన్ని ఏఎన్ఐతో షేర్ చేశారు. #WATCH | Chennai, Tamil Nadu: Indian para-athlete Suvarna Raj alleges that she was mistreated by IndiGo Airlines crew members while taking a flight from New Delhi to Chennai yesterday. "...I told them 10 times that I want my personal wheelchair at the aircraft door, but no… pic.twitter.com/avResgXHJ0 — ANI (@ANI) February 3, 2024 విమానం డోర్ వద్ద తనకు వ్యక్తిగత వీల్‌చైర్ గురించి సిబ్బంది స్పందించలేదని ఆరోపించారు. న్యూఢిల్లీనుంచి చెన్నైకి వెళ్తుండగా ఇండిగో సిబ్బంది తన పట్ల దారుణంగా ప్రవర్తించారని సువర్ణ తెలిపారు. ఇండిగో నిర్ల్యక్షం మూలంగా తన వ్యక్తిగత వీల్‌చైర్ పాడైందని, దాని రిపేర్‌కు రూ. 3 లక్షలు ఖర్చయ్యాయని పేర్కొన్నారు. ఈ నష్టాన్ని ఇండిగోనే భరించాలన్నారు. వికలాంగులకు వీల్చైర్లు ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సువర్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు సింగ్ వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. వికలాంగుల సమస్యను అర్థం చేసుకొని వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని రాజ్ కోరారు. -
సాహసయాత్ర: ఒంటి కాలితో సైకిల్ మీద 3,700 కిమీ
తిరువనంతపురం: మన మీద మనకు నమ్మకం.. గట్టి సంకల్పం ఉంటే చాలు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి పోరాడవచ్చు. సాధించాలనే తపన నీకుంటే.. విధి సైతం నీ ముందు తలవంచి తప్పుకుంటుంది అంటారు కార్య సాధకులు. ఈ మాటలను నిజం చేసి చూపాడు కేరళకు చెందిన ఓ వ్యక్తి. పక్షవాతం వచ్చి కుడి కాలు చచ్చు బడింది. దాంతో ఉద్యోగం కోల్పోయాడు. అయినా అతడు మనోధైర్యాన్ని కోల్పోలేదు. అంగ వైకల్యాన్ని పక్కకు పెట్టి.. ఒంటి కాలితో సైకిల్ తొక్కుతూ.. ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్‌లలో ఒకటైన ఖార్డంగ్ లా చేరాలని భావించాడు. లద్ధాఖ్ నుంచి మొదలు పెట్టి 3,700 కిలోమీటర్లు ప్రయాణించాడు.. ఇంకా వెళ్తూనే ఉన్నాడు. అంగ వైకల్యం అతడికి అడ్డంకిగా మారలేదు. అతడి ప్రయాణం.. పయనం ఎందిరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ వివరాలు.. కేరళ, త్రిసూర్‌కు చెందిన మహ్మద్ అశ్రఫ్ కొన్నేళ్లుగా దుబాయ్‌లో కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తూండేవాడు. సాపీగా సాగిపోతున్న అతడి జీవితంలో 2017లో పెద్ద కుదుపు చోటు చేసుకుంది. పెద్ద ప్రమాదానికి గురయ్యాడు మహ్మద్.. ఫలితంగా పక్షవాతం వచ్చి అతడి కుడి కాలు పడిపోయింది. దాంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సందర్భంగా మహ్మద్ మాట్లాడుతూ.. ‘‘2017లో బైక్ యాక్సిడెంట్ అయ్యింది. 9 ఆపరేషన్లు చేశారు. ఏళ్ల పాటు ఆస్పత్రిలో ఉన్నాను. ఆ తర్వాత నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. వీటన్నింటిని చూసి తీవ్ర నిరాశకు గురయ్యాను. డిప్రెషన్ నుంచి బయటపడటం కోసం గతేడాది, ఏప్రిల్‌లో పర్వతాలు ఎక్కడం ప్రారంభించాను. దాంతో నాకు ఎక్కడాలేని ఉత్సాహం వచ్చింది. పర్వతారోహణతో ప్రేమలో పడ్డాను’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ ప్రయాణంలో నా లోపమే నా సామర్థ్యం అని తెలిసి వచ్చింది. దాంతో మనిషి తల్చుకుంటే ఈ లోకంలో సాధ్యం కానిది ఏది ఉండదని నిరూపించాలనుకున్నాను. నేను కుంగిపోయి ఉంటే.. మంచానికే పరిమితం అయి ఉండేవాడిని. కానీ నేను అలా ఉండాలని కోరుకోలేదు. సాధ్యం కానిది ఏది లేదని నిరూపించాలనుకున్నాను. అందుకే ఈ సాహసం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపాడు. ‘‘17,582 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్‌లలో ఒకటైన ఖార్డంగ్ లాను సైకిల్ మీద చేరుకోవడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పటికి 11 రాష్ట్రాలు దాటాను. రోజుకు 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను. నాతో పాటు ఓ మడతపెట్టగలిగే ఓ టెంట్, నిద్ర పోవడానికి ఉపయోగించే ఓ బ్యాగ్ తీసుకుని జర్నీ ప్రారంభించాను. రాత్రి పూట పెట్రోల్ బంకుల్లో నిద్రపోయేవాడిని’’ అని తెలిపారు. ‘‘ఈ ప్రయాణంలో నాకు ఎందరో మద్దతుగా నిలుస్తున్నారు. 1000 కిలోమీటర్లు ప్రయాణించి త్రిసూర్ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నాను. నా ప్రయాణం గురించి తెలిసి నాకు ఆహారం, బస ఏర్పాటు చేశారు. డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇందుకు వారికి రుణపడి ఉంటాను’’ అన్నాడు. కృత్రిమ కాలు అమర్చుకోవచ్చు కదా అంటే.. ‘‘మూడేళ్లు ఆస్పత్రిలో ఉండే సరికి నా కుటుంబం పొదుపు చేసిన మొత్తం ఖర్చయ్యింది. ఈ టూర్ పూర్తయ్యాక డబ్బులు పోగేసి.. సర్జరీ చేయించుకుని.. కృత్రిమ కాలు పెట్టించుకుంటాను’’ అని తెలిపాడు మహ్మద్. -
Priyadarshini Nahar: విజయానికి ప్రధాన కారణం అదే...
‘మేం అంగవికలురం కాదు, దివ్యాంగులం’ అంటారు ప్రియదర్శినీ నహర్. అందరు పిల్లల్లాగానే ఆరోగ్యంగా పుట్టారు ప్రియా. చక్కగా ఆటపాటలతో బాల్యం అందంగా, ఆనందంగానే గడుస్తోంది. ఇంతలోనే విధి చిన్న చూపు చూసింది. ప్రియదర్శినికి ఆరు సంవత్సరాల వయసులో, పోలియో కాటు వేసింది. రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. శరీరం పనిచేయలేదు. ప్రియా నహర్ తన అచేతన స్థితికి కుంగిపోలేదు. తల్లిదండ్రుల సహకారంతో, ప్రోత్సాహంతో చదువుకోవటం ప్రారంభించింది. కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు ప్రియదర్శినీ నహర్. అక్కడితో ఆగిపోలేదు. తనలాంటి ఎంతోమందికి చదువు చెప్పాలనుకున్నారు. అందుకోసం టెక్నాలజీని వాడుకోవాలనుకున్నారు ప్రియదర్శిని. ఆన్లైన్ క్లాసుల ద్వారా దివ్యాంగులకు పోటీ పరీక్షలకు కావలసిన శిక్షణ ఇవ్వాలనుకున్నారు. తనకు ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టారు. ఇందుకోసం పెద్ద ఆఫీసు తీసుకోలేదు. ఒక చిన్న గదిలో కూర్చుని, ముగ్గురు విద్యార్థులకు ఆన్లైన్లో ట్యూషన్ చెప్పటం ప్రారంభించారు. ఒకరి నుంచి ఒకరికి ఈ విషయం తెలిసి, ఉత్సాహవంతులైన చాలామంది దివ్యాంగులు ఆన్లైన్ క్లాసులకు కూర్చోవటం మొదలుపెట్టారు. క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో, పుణేలోని లా కాలేజ్ రోడ్డులో ‘యాష్ క్లాసెస్’ ప్రారంభించే స్థాయికి ఎదిగారు. ‘ది ఆసరా’ సంస్థ ప్రియా నహర్కి ఎంతగానో సహకరించింది. మార్కెటింగ్ ప్లాన్ చెప్పి, మరింతమంది విద్యార్థులు ఇందులో చేరేలా ఈ సంస్థ ప్రోత్సహించింది. ఇప్పుడు ‘యాష్ క్లాసెస్’ అంటే మంచి శిక్షణ సంస్థగా పేరు సంపాదించుకుంది. వందమందికి పైగా సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు విద్యార్థులకు లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు, కంప్యూటర్స్, ఎకనమిక్స్, కామర్స్ అంశాలలో మంచి శిక్షణ ఇస్తున్నారు ప్రియదర్శిని. తన దగ్గరే టీచర్లను వేసుకుని వారికి జీతాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు ప్రియా నహర్. ఇప్పుడు ఈ సంస్థ ద్వారా రెండువేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు, ‘ఓపెల్ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్’ అనే సంస్థను కూడా స్థాపించి, దివ్యాంగులకు రకరకాల వృత్తులలో శిక్షణ ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాలుగా ఈ సంస్థను ప్రియదర్శిని విజయవంతంగా నడుపుతున్నారు. తన గురించి చెబుతూ... ‘‘మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. నాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. చెల్లికి వివాహమైంది. పుణేలో ఉంటోంది. మా తమ్ముడు మంచి వస్త్ర వ్యాపారవేత్త అయ్యాడు. మా తల్లిదండ్రుల కృషి, పట్టుదలతో ఇప్పుడు నేను కొద్దికొద్దిగా నడవగలుగుతున్నాను. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా నాకు మంచి చదువు చెప్పించారు అమ్మవాళ్లు. నా కాళ్ల మీద నిలబడాలనుకున్నాను. బయటకు వెళ్లలేని పరిస్థితి నాది. అందువల్ల ఇంటి నుంచే ఏదో ఒక పని చేయాలనుకున్నాను. చదువుకునే రోజుల్లో నేను బ్రైట్ స్టూడెంట్‌ని కావటం వల్ల, చదువుకు సంబంధించిన వాటిమీదే నా దృష్టి పెట్టాను. అలా ప్రారంభమైంది యాష్ కోచింగ్ సెంటర్’’ అంటున్న ప్రియదర్శిని.. విద్యార్థులకు చదువుతో పాటు, బిహేవియరల్ అనలిస్టులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌లో కూడా శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది యోగా గురువులతో దివ్యాంగుల కోసం జిమ్ కూడా ప్రారంభించారు. ‘‘నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. పిల్లలకు పాఠాలు చెప్పటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. ముందు నేను శ్రద్ధగా చదువుకుని, ఆ తరవాత పిల్లలకు చెబుతాను. చాలామంది విద్యార్థులు మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటూ, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వాళ్లని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను పెళ్లి చేసుకోకపోయినా, నాలాంటి చాలామంది పిల్లలకు తల్లిని. ‘నాణ్యమైన పని విజయానికి ప్రధాన కారణం’ అని నేను నమ్ముతాను’’ అంటారు ప్రియదర్శిని నహర్. Fortune World's 50 Greatest Leaders List: ఫార్చూన్ ఉమెన్ -
మోదీని విమర్శించాడని దివ్యాంగుడిపై దాడి
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో దిగ్ర్భాంతికర ఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్‌లను విమర్శించినందుకు ఓ దివ్యాంగునిపై బీజేపీ నేత భౌతిక దాడికి పాల్పడ్డారు. యూపీలోని సంభాల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ ఘటన జరిగింది. కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితుడు మనోజ్ గుజ్జార్ తాను మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు ఓటు వేస్తానని చెబుతూ మోదీ, యోగిలను విమర్శించడంతో అక్కడే ఉన్న బీజేపీ నేత మహ్మద్ మియాన్‌ను కర్రతో కొట్టి హింసించాడు. చందుసి తెహిసిల్‌లోని ఖర్జా గేట్ ప్రాంతానికి చెందిన గుజ్జార్‌ను బీజేపీ నేత కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మియన్‌పై అస్మోలి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారని, ఆయనకు నేరచరిత్ర ఉందని సంభాల్ ఎస్పీ వెల్లడించారు. కాగా సీనియర్ బీజేపీ నేతలపై గుజ్జర్ అమర్యాదకరంగా మాట్లాడటంతో తాను సహనం కోల్పోయి అతడిపై దూషణలకు దిగానని, దీనిపై అతనికి బహిరంగ క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధమని మియన్ పేర్కొన్నారు. -
'తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగులదే కీలకపాత్ర'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగులే కీలక పాత్ర పోషించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ గద్దెనెక్కాక ఒక్కసారి కూడా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనకపోవడం ఆయనకు వారి పట్ల ఉన్న చిన్న చూపుకు నిదర్శనం అని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన వికలాంగుల దినోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జనాభా నిష్పత్తి ప్రకారం వికలాంగులకు మూడు శాతం డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రత్యేక శాఖ కోసం అసెంబ్లీలో డిమాండ్ చేస్తామని చెప్పారు. -
వికలాంగులపై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ
తమ బాధను వెళ్లబోసుకునేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకునేందుకు వెళ్లిన వికలాంగులకు చేదుఅనుభవం ఎదురైంది. బెంగాల్ లోని బర్ద్వాన్ జిల్ఆలలోని ఝిన్ గుటి గ్రామంలో ఆమెను కలిసేందుకు వెళ్లిన రెండు వేల మంది వికలాంగులకు మమతా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో వారు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. దాంతో మమత దీదీకి నషాళానికి అంటింది. ఆమె వారిపై తిట్ల వర్షం కురిపించింది. 'మీరంతా కాంతీ గంగూలీ ముఠా వాళ్లని నాకు తెలసు' అని కేకలు వేసింది. కాంతి గంగూలీ వామపక్ష పార్టీ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ నేత. దాంతో వికలాంగులు ఖంగు తిన్నారు.తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని వారు వాదించారు. కానీ మమతా దీదీ మంకుపట్టు ముందు వికలాంగుల వాదనలు వీగిపోయాయి.