వికలాంగులపై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ
తమ బాధను వెళ్లబోసుకునేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకునేందుకు వెళ్లిన వికలాంగులకు చేదుఅనుభవం ఎదురైంది.
బెంగాల్ లోని బర్ద్వాన్ జిల్ఆలలోని ఝిన్ గుటి గ్రామంలో ఆమెను కలిసేందుకు వెళ్లిన రెండు వేల మంది వికలాంగులకు మమతా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో వారు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. దాంతో మమత దీదీకి నషాళానికి అంటింది. ఆమె వారిపై తిట్ల వర్షం కురిపించింది. 'మీరంతా కాంతీ గంగూలీ ముఠా వాళ్లని నాకు తెలసు' అని కేకలు వేసింది.
కాంతి గంగూలీ వామపక్ష పార్టీ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ నేత. దాంతో వికలాంగులు ఖంగు తిన్నారు.తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని వారు వాదించారు. కానీ మమతా దీదీ మంకుపట్టు ముందు వికలాంగుల వాదనలు వీగిపోయాయి.