డిజిటల్‌ పేమెంట్స్‌లో మార్పులు.. ఆర్‌బీఐ ఆదేశం | RBI asks banks to ensure access for differently abled | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ పేమెంట్స్‌లో మార్పులు.. ఆర్‌బీఐ ఆదేశం

Published Sat, Oct 12 2024 8:46 PM | Last Updated on Sun, Oct 13 2024 10:09 AM

RBI asks banks to ensure access for differently abled

ముంబై: వైకల్యంతో బాధపడే కస్టమర్లు సులభంగా సేవలు పొందే విధంగా బ్యాంక్‌లు తమ చెల్లింపుల వ్యవస్థలను సమీక్షించుకోవాలని ఆర్‌బీఐ కోరింది. సమాజంలోని అన్ని వర్గాలు, దివ్యాంగులు సైతం డిజిటల్‌ చెల్లింపులను అనుసరిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.

‘‘మరింత మెరుగైన సేవలను పొందేందుకు వీలుగా చెల్లింపుల వ్యవస్థల భాగస్వాములు (పీఎస్‌పీలు/బ్యాంక్‌లు/నాన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లు) తమ చెల్లింపుల వ్యవస్థలు/పరికరాలను సమీక్షించాలి. దివ్యాంగులు సైతం సులభంగా వినియోగించుకునే విధంగా ఉండాలి. సమీక్ష అనంతరం దివ్యాంగులు సైతం వినియోగించుకునేందుకు వీలుగా.. బ్యాంక్‌లు, నాన్‌ బ్యాంక్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లు తమ వ్యవస్థల్లో, పీవోఎస్‌ మెషిన్లలో అవసరమైన మార్పులు చేయాలి’’అని ఆర్‌బీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement