న్యూఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ శనివారం ఢిల్లీ కోర్టులో హాజరయ్యారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దిగ్విజయ్పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
కాగా ఈ కేసు విచారణకు సంబంధించి దిగ్విజయ్ తొలుత కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయస్థానం ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతరం దిగ్విజయ్ కోర్టుకు వచ్చారు. దిగ్విజయ్కు అంతకుముందు జారీ చేసిన వారెంట్ను న్యాయమూర్తి రద్దు చేశారు. తదుపరి విచారణకు ఈ నెల 10న హాజరుకావాల్సిందిగా దిగ్విజయ్ను ఆదేశించారు.
దావా కేసులో కోర్టుకు హాజరైన దిగ్విజయ్
Published Sat, Nov 1 2014 7:51 PM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement
Advertisement