'నల్ల' జాబితాలోని అన్ని పేర్లు బయటపెట్టండి: సుప్రీం
'నల్ల' జాబితాలోని అన్ని పేర్లు బయటపెట్టండి: సుప్రీం
Published Tue, Oct 28 2014 5:16 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: నల్ల కుబేరుల జాబితాను వెల్లడి అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న బ్లాక్ మనీ జాబితాలోని ముగ్గురి పేర్లను మాత్రమే కేంద్రం వెల్లడించడంపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
రేపటికల్లా జాబితాలోని అందరి పేర్లను బహిర్గతం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో బుధవారం సుప్రీం కోర్టుకు ఓ నివేదిక ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది.
విదేశాల్లో డబ్బు దాచిన వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారని మోడీ సర్కార్ పై కేంద్ర మండిపడింది. నల్లధనాన్ని వెనక్కి తెచ్చే వ్యవహారాన్ని ప్రభుత్వానికి విడిచిపెట్టలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. నిర్దేశిత సమయంలోగా ఆ పని ఎప్పటికి పూర్తి కాదని సుప్రీం కోర్టు తెలిపింది.
Advertisement