foreign banks
-
నిష్క్రమణ బాటలో విదేశీ బ్యాంకులు
న్యూఢిల్లీ: భారత్‌లో రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్న విదేశీ బ్యాంకుల జాబితాలో తాజాగా సిటీబ్యాంక్ కూడా చేరింది. 2011లో డాయిష్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని ఇండస్ఇండ్ బ్యాంక్‌కు విక్రయించింది. 2013లో యూబీఎస్ వైదొలిగింది. మోర్గాన్ స్టాన్లీ తమ బ్యాంకింగ్ లైసెన్సును రిజర్వ్ బ్యాంక్‌కు సరెండర్ చేసింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిల్ లించ్, బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ 2015లో తమ కార్యకలాపాలను తగ్గించుకున్నాయి. 2016లో కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా నిష్క్రమించింది. అదే ఏడాది హెచ్ఎస్బీసీ రెండు డజన్లపైగా శాఖలను మూసివేసింది. బీఎన్పీ పారిబా 202లో తమ వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని మూసివేసింది. దక్షిణాఫ్రికాకు చెందిన రెండో అతి పెద్ద బ్యాంక్ ఫస్ట్‌ర్యాండ్‌బ్యాంక్ సైతం దేశీ మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించింది. 1984 నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఆస్ట్రేలియా అండ్ న్యూజిల్యాండ్ బ్యాంక్ 2000లో తమ గ్రిండ్లేస్ బ్యాంక్‌ను స్టాండర్డ్ చార్టర్డ్‌కు విక్రయించి తప్పుకుంది. అయితే, 2011లో ముంబైలో కొత్త బ్రాంచ్ ద్వారా తిరిగివచ్చింది. దేశీ బ్యాంకుల నుంచి పోటీ పెరిగిపోతుండటం, పాటించాల్సిన నిబంధనలు వివిధ రకాలుగా ఉండటం, అసెట్ క్వాలిటీపరమైన సమస్యలు మొదలైనవి విదేశీ బ్యాంకుల నిష్క్రమణకు దారి తీస్తున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. పలు విదేశీ బ్యాంకులు తప్పుకుంటున్నప్పటికీ కొన్ని మాత్రం నిలదొక్కుకుంటున్నాయి. జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్‌కు భారత్‌లో 16 శాఖలు ఉన్నాయి. 2020లో లక్ష్మి విలాస్ బ్యాంక్‌ను డీబీఎస్ బ్యాంక్ ఇండియా కొనుగోలు చేసింది. -
విదేశాల్లోని నల్లధనంపై మా దగ్గర లెక్కల్లేవ్ - ప్రభుత్వ ప్రకటన
న్యూఢిల్లీ: విదేశీ అకౌంట్లలో నల్లధనం ఎంతుందన్న విషయంలో గడచిన ఐదేళ్లలో అధికారిక అంచనాలు ఏవీ లేవని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. అయితే 2015లో మూడు నెలల వన్–టైమ్ సెటిల్మెంట్ విండో కింద రూ. 2,476 కోట్లు పన్ను, పెనాల్టీగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. నల్లధనం (బహిర్గతం కాని విదేశీ ఆదాయం–ఆస్తులు) పన్ను చట్టం, 2015 విధించడం కింద సెప్టెంబర్ 30, 2015తో ముగిసిన మూడు నెలల వన్ టైమ్ విండో కింద రూ. 4,164 కోట్ల విలువైన బహిర్గతం చేయని విదేశీ ఆస్తులు వెల్లడయినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన లావాదేవీల సంఖ్య 648 అని వివరించారు. -
భారత్ చేతికి స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై పోరులో భారత ప్రభుత్వం మరింత పురోగతి సాధించింది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాల రెండో సెట్‌ను అందుకుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈవోఐ) కింద 2019 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్ నుంచి మొదటి సెట్‌ను భారత్ అందుకుంది. తాజాగా ఈ ఏడాది భారత్ సహా 86 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) పంచుకుంది. ఈ దేశాలతో గతేడాది స్థాయిలోనే సుమారు 31 లక్షల అకౌంట్ల సమాచార మార్పిడి జరిగిందని ఎఫ్‌టీఏ తెలిపింది. వీటిల్లో భారతీయ పౌరులు, సంస్థల ఖాతాల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో ఆర్థిక వివరాలను సక్రమంగా వెల్లడించారా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. -
‘డాలర్’ డ్రీమ్ ఇక చౌకే!!
అమ్మబోతే అడవి. కొనబోతే కొరివి!!. ఈ సామెత బ్యాంకుల్లో డాలర్ లావాదేవీలు జరిపే రిటైల్ కస్టమర్లకు అనుభవంలోకి వస్తుంటుంది. బ్యాంకులు విదేశీ కరెన్సీని కస్టమర్‌కు అమ్మేరేటుకు, వారి నుంచి కొనే రేటుకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉంటుంది. ఇకపై బ్యాంకుల ఈ భారీ బాదుడుకు ఆర్బీఐ చెక్ చెబుతోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫారిన్ కరెన్సీ (ఫారెక్స్) లావాదేవీలు జరిపే వీలును రిటైల్ కస్టమర్లకు ఆర్బీఐ కల్పించనుంది. టూరిస్టు వీసా వచ్చిందని, చదువులకని, ఉద్యోగాలకని ఏటా ఇండియా, అమెరికా మధ్య లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఇలా అమెరికా యాత్ర పెట్టుకున్నవాళ్లంతా రూపాయలను డాలర్లలోకి మార్చుకోవడం, అక్కడ నుంచి వచ్చాక డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడం తప్పని సరి కార్యక్రమమనే చెప్పాలి. అమెరికాయే కాదు. విదేశాల్లో దాదాపు ఎక్కడికెళ్లినా అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ చెల్లుతుంది కనుక... అక్కడ లోకల్ కరెన్సీని తీసుకోవాలన్నా డాలర్‌తో ఈజీ కనుక అంతా డాలర్లవైపే మొగ్గుతారు. ఈ డాలర్లకున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు ఇలాంటి కస్టమర్లకు డాలర్లు అమ్మేటప్పుడు భారీ ప్రీమియంలు వసూలు చేస్తుంటాయి. కస్టమర్లు డాలర్లు కొనుగోలు చేసే సమయంలో ఎక్చేంజ్ రేట్‌పై దాదాపు 2 శాతం ప్రీమియంతో విక్రయించడం, అదే కస్టమర్లు డాలర్లను విక్రయించడానికి వచ్చినప్పుడు ఎక్చేంజ్ రేటుపై దాదాపు 2 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయడం బ్యాంకులకు పరిపాటిగా మారింది. ఒకవేళ కస్టమరు క్రెడిట్‌కార్డు ద్వారా డాలర్ కొనాలంటే మరో 3 శాతం ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి కస్టమర్ కష్టాలకు త్వరలో విముక్తి లభించనుంది. ఫారెక్స్ మార్పిడి విషయంలో బ్యాంకులు విధించే భారీ మార్జిన్ల కారణంగా నష్టపోతున్న కస్టమర్లకు త్వరలో ఊరట కలగనుంది. వచ్చే ఆగస్టు నుంచి రిటైల్ కస్టమర్లకు దాదాపు ఎక్చేంజ్ రేటుకు సమానంగానే బ్యాంకులు డాలర్లను అమ్మడం, కొనడం చేయాల్సి ఉంటుంది. అంతేకాక బ్యాంకులన్నీ ఈ అమ్మకాలు, కొనుగోళ్లను ఒకే ఉమ్మడి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌పై చేయాల్సి ఉంటుంది. రెండేళ్లకు కార్యరూపం రిటైల్ కస్టమర్లకు బ్యాంకులు వసూలు చేసే భారీ మార్జిన్ల నుంచి ఊరట కలిగించాలని 2017లోనే ఆర్బీఐ నిర్ణయించింది. 2017 అక్టోబర్‌లో దీనికి సంబంధించి చర్చాపత్రం విడుదల చేసింది కూడా. తరవాత క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సీసీఐఎల్) కలిసి రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. తొలుత ఆరంభంలో వెయ్యి డాలర్లు, తర్వాత ప్రతిసారీ 500 డాలర్ల చొప్పున ఈ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించాలని ఆర్బీఐ భావించింది. కానీ ఎంత మొత్తాన్నయినా ఈ ప్లాట్‌ఫామ్‌పై అనుమతించాలని ఆర్బీఐ తాజాగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ఫామ్‌పై గరిష్ఠ పరిమితి 5 లక్షల డాలర్లు. తొలుత డాలర్ల అమ్మకాలు, కొనుగోళ్లకు మాత్రమే ఈ ప్లాట్‌ఫామ్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆ తర్వాతి దశల్లో ఇతర కరెన్సీలకు దీన్ని విస్తరిస్తారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే రిటైల్ ఆర్డర్లన్నింటినీ కలిపి మార్కెటబుల్ లాట్స్గా మార్చి ఇంటర్‌బ్యాంక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. దీంతో కస్టమర్లకు బ్యాంకుల మధ్యన జరిగే ఎక్చేంజ్ రేటే వర్తిస్తుంది. జూలై 1న రిజిస్ట్రేషన్లు ఆరంభం ప్లాట్‌ఫామ్‌పై కస్టమర్ల రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి ఆరంభమవుతాయని భారత ఫారిన్ ఎక్చేంజ్ డీలర్ల సమాఖ్య తెలిపింది. ఆగస్టు 5 నుంచి ప్లాట్‌ఫామ్‌పై ట్రేడింగ్ ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాల సమాచారం. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది కస్టమర్లు పాల్గొనేందుకు ఒక నెల ముందే రిజిస్ట్రేషన్లను ఆర్బీఐ ఆరంభించిందని, ఎంత మొత్తంలో లావాదేవీలు జరపవచ్చనే విషయం ఆర్బీఐ త్వరలో నిర్ణయిస్తుందని, ఒక్క రూపాయి లావాదేవీనైనా సరే సీసీఐఎల్ సెటిల్ చేస్తుందని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన యాప్‌ను విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో కస్టమర్లు బేసిక్ సమాచారం అం దించాల్సి ఉంటుంది. సదరు కస్టమర్‌కు తన బ్యాంకు ట్రేడింగ్ లిమిట్ నిర్ధారిస్తుంది. ఈ పరిమితికి అనుమతి వచ్చాక కస్టమర్‌కు సీసీఐఎల్ లాగిన్ వివరాలు పంపుతుంది. ఈ వివరాలతో లాగినై కస్టమర్ ఆర్డర్లను ఉంచడం, కాన్సిల్ చేయడం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇంటర్ బ్యాంక్ ఎక్చేంజ్రేట్లు ప్లాట్‌ఫామ్‌పై కనిపిస్తుంటాయి. కస్టమర్ నేరుగా ఆ రేట్లు పొందలేడు, కొందరు కస్టమర్ల ఆర్డర్లన్నింటినీ కలిపి ఒక లాట్‌గా మార్చి లావాదేవీ నిర్వహిస్తారు. అందువల్ల స్పాట్ రేటుతో పోలిస్తే కస్టమర్‌కు వచ్చే రేటులో స్వల్పతేడా ఉండొచ్చు. దీనికితోడు కస్టమర్‌కు చెందిన బ్యాంకు స్వల్ప రుసుమును సదరు లావాదేవీకి వసూలు చేస్తుంది. అనంతరం కస్టమ ర్ లావాదేవీకి వచ్చిన రసీదు తీసుకొని తన బ్యాం కుకు వెళ్లి డాలర్లను తీసుకోవడం, లేదా జమ చేయడం చేస్తారు. ప్లాట్‌ఫామ్‌ను స్పెక్యులేషన్‌కు వినియోగించకుండా జాగ్రత్తలు చేపడతారు. -
విదేశీ బ్యాంకు వంచన కేసులో ఇద్దరి అరెస్ట్
బనశంకరి : ఓ విదేశీ బ్యాంకులో అకౌంటెంట్లుగా చేరిన ఇద్దరు వ్యక్తులు పెద్ద మొత్తంలో నగదును వారి సొంత ఖాతాల్లోకి మళ్లించిన కేసులో సదరు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 8.14 కోట్ల నగదు, 470 గ్రాముల బంగారు నగలు, భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషర్ సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అమెరికాకు చెందిన జెపీ మోర్గాన్ బ్యాంకు ఇక్కడి మారతహళ్లిలో ఉంది. ఈ బ్యాంకులో 2013లో బెళ్లందూరుకు చెందిన సురేశ్‌బాబు, దొడ్డగుబ్బికి చెందిన మారుతి అలియాస్ రాము అకౌంటెంట్లుగా చేరారు. 2017 ఆగస్టు 24న బ్యాంక్‌కు చెందిన ఖాతాదారుడి నుంచి మరో ఖాతాదారుడి అకౌంట్‌కు రూ.12.15 కోట్ల నగదు బదిలీ కావాల్సి ఉంది. ఈ ఇద్దరు అకౌంటెంట్లు ఆ నగదును తమ ఖాతాల్లోకి మళ్లించుకుని బంగారు ఆభరణాలు, స్థలాలు కొనుగోలు చేశారు. ఇదే సమయంలో ఇద్దరూ ఉద్యోగాలు వదిలివేశారు. ఈ నేపథ్యంలో ఓ ఖాతాదారుడు తనకు రావాల్సిన నగదు అకౌంట్లో జమ కాలేదని బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. మారతహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెన్నైలో తలదాచుకున్న మారుతిని సోమవారం అరెస్ట్ చేశారు. ఇతడిని విచారణ చేయగా అసలు గుట్టు విప్పాడు. అతడి సమాచారంతో సురేష్‌ను కూడా అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన పోలీసులకు రూ. 50 వేల నగదు బహుమతిని కమిషనర్ సునీల్ కుమార్ ప్రకటించారు. -
పెద్ద నోట్ల రద్దుతో ఒరిగేదేమీ లేదు..
బ్లాక్ మనీపై ఉక్కుపాదం మోపుతూ, పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి ప్రకటించిన సంచలనాత్మక నిర్ణయం వల్ల అంతలా ఒరిగేదేమీ లేదని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) అత్యున్నత స్థాయి అధికారి పేర్కొన్నారు. బ్లాక్ మనీ ఎక్కువగా విదేశీ బ్యాంకుల్లో, విదేశీ కరెన్సీ, గోల్డ్, ఇతర ఆస్తుల రూపంలో ఉంటుందని తెలిపారు. '' బ్లాక్‌మనీ ఎక్కువగా విదేశీ కరెన్సీ రూపంలో, బంగారం, ఆస్తుల రూపంలో ఉంటుందని అందరికీ తెలుసు. నగదు రూపంలో బ్లాక్‌మనీ లావాదేవీలు తక్కువగా ఉంటాయి. కేవలం ఈ చర్యలు మాత్రమే బ్లాక్‌మనీని నిర్మూలించడానికి సహకరించవు'' అని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్. వెంకటాచలం మంగళవారం రాత్రి తెలిపారు. ఇక నకిలీ నోట్ల వ్యవహారానికి వస్తే, కేవలం ఈ చర్య మాత్రమే సరిపోదని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా నకిలీ నోట్ల వ్యవహారంలో మూల కారణాలనే కనుగొనలేకపోతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఈ నిర్ణయంతో కొత్త నకిలీ నోట్లు చలామణిలోకి వస్తాయి అని వ్యాఖ్యానించారు. దేశమంతా 102,000ఏటీఎంలు, 85,000 వాణిజ్య బ్యాంకు శాఖలు 10,000 కోపరేటివ్ బ్యాంకు శాఖలు ఉన్నాయని తెలిపారు. ఆర్బీఐ కొత్త నోట్లను బ్యాంకు శాఖలకు, ఏటీఎంలకు సప్లై చేయలేకపోతే, వచ్చే 24, 48 గంటల్లో సాధారణ ప్రజానీకానికి కొత్త నోట్ల పంపిణీ సాధ్యం కాదని హెచ్చరించారు. 500, 1000 నోట్ల రద్దుతో సాధారణ ప్రజలు చాలా అవస్థలు పడాల్సివస్తుందన్నారు. కాగ, నిన్న రాత్రి ప్రధాని నరేంద్రమోదీ బ్లాక్‌మనీపై సర్జికల్ స్టైక్ ప్రకటిస్తూ.. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సాధారణ ప్రజల్లో భయాందోళన నెలకొంది. 500, 1000నోట్లను ఏటీఎంలలో డిపాజిట్ చేసి, 100 రూపాయల నోట్లు తీసుకోవడం కోసం ప్రయత్నించారు. కానీ ఏటీఎంలన్నీ స్ట్రక్ కావడంతో, ప్రజలు రోడ్లపై బారులు తీశారు. -
10శాతం పెట్టుబడులకు విదేశీ బ్యాంకులకు అనుమతి
ముంబై : స్థానిక ప్రైవేట్ రుణదాతలకు, లైఫ్ ఇన్సూరెన్సె కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల్లో 10శాతం పెట్టుబడి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ బ్యాంకులకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. మూలధనాన్ని, ఈ రంగంలో స్థిరీకరణను ప్రోత్సహించడానికి రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త పాలసీలను సెంట్రల్ బ్యాంకు గురువారం ప్రకటించింది. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకుల్లో 10శాతం వాటాను వ్యక్తులు, సంస్థలు పొందేలా అనుమతినిచ్చింది. నాన్ రెగ్యూలేటెడ్, నాన్ డైవర్సిఫైడ్, లిస్ట్ కాని ఫైనాన్సియల్ సంస్థలు 15శాతం వాటాను పొందేలా.. రెగ్యులేటెడ్, డైవర్సిఫైడ్, లిస్ట్ అయిన సంస్థలు 40శాతం వాటాను పొందేలా రిజర్వు బ్యాంకు ఈ కొత్త పాలసీను తీసుకొచ్చింది. ఆర్బీఐ తీసుకున్న ఈ కొత్త పాలసీల వల్ల బ్యాంకింగ్ రంగంలో స్థిరీకరణ వస్తుందని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ పార్టనర్ కల్సేష్ మెహతా తెలిపారు. 2013లో కొత్త బ్యాంకు లైసెన్సులు జారీ వెలుగులోకి వచ్చినప్పటీ నుంచి ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో షేర్ హోల్డింగ్ మార్గదర్శకాలను పునఃసమీక్షిస్తున్నామని ఆర్బీఐ చెప్పింది. బేసల్-3 నిబంధనల అమలు మేరకు రుణదాతలకు అవసరమైనంత అదనపు మూలధనం అందించడానికి తోడ్పడుతున్నామని పేర్కొంది. ఒకవేళ బోర్డు అనుమతులు లభిస్తే, ఎలాంటి రెగ్యులేటరీ అభిప్రాయం అవసరం లేకుండానే పెట్టుబడిదారులు బ్యాంకుల్లో ఎక్కువ వాటా కలిగి ఉండేలా చేస్తామని చెప్పింది. -
ప్రభుత్వ వైఖరి సరికాదు
విదేశీ బ్యాంకుల్లో ఖాతాదారుల పేర్ల గోప్యతపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కోల్‌కతా: విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయుల పేర్ల గోప్యత విషయంలో ప్రభుత్వం సరైన కారణం చెప్పలేదని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అన్నారు. విదేశాలతో రెండు పన్నులు తప్పించే ఒప్పందం (డీటీఏఏ) కారణంగా పేర్లు వెల్లడించడం సాధ్యంకాదని ప్రభుత్వం చెప్పడం సహేతుకంగా లేదని శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పేర్లు బహిర్గతం చేయకూడదని డీటీఏఏ ఒప్పందంలో ఉన్న నిబంధనను అధిగమించాలన్నారు. గతం లో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు డీటీఏఏ కింద జర్మన్ బ్యాంకు లీక్టెస్టీన్ ఖాతాదారుల పేర్లు వెల్లడించాలని ఆ ప్రభుత్వానికి లేఖ రాశారని చెప్పారు. అయితే డీటీఏఏ కింద పేర్లు వెల్లడించాలని గత ప్రభుత్వం తప్పుగా కోరిందనే విషయం తెలియజేస్తూ జర్మనీ ప్రభుత్వానికి ప్రస్తుత భారత ప్రభుత్వం లేఖ రాయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పేర్లు వెల్లడించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్వామి చెప్పారు. పేర్ల వెల్లడిపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేస్తున్న వాదన సరైనది కాదనే విషయం ప్రధాని మోడీకి లేఖ ద్వారా తెలియజేశానని ఆయన వెల్లడించారు. గతంలో డీటీఏఏపై బీజేపీ చేసిన విమర్శలను ప్రస్తావించగా.. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చాక సిట్‌ను నియమించిందన్నారు. అందువల్ల ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించాల్సిందేనన్నారు. -
రాధా టింబ్లోకు ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా మైనింగ్ దిగ్గజం రాధా టింబ్లో కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. నవంబర్ 12 తేదిన విచారణకు హాజరుకావాలంటూ నోటిసుల్లో ఈడీ పేర్కొంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా సంస్థ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను అందజేయాలని టింబ్లో సంస్థను ఈడీ అధికారులు అడిగిన సంగతి తెలిసిందే. -
పొంతనలేని నల్లధనం లెక్కలు!
దేశం నుంచి తరలిపోయిన నల్లధనం లెక్కలకు పొంతన లేదు. ఇంత వరకు ఎవరూ ఇంత సొమ్ము విదేశీ బ్యాంకులలో దాచుకున్నారని స్పష్టంగా చెప్పిన పాపాన పోలేదు. ఎవరి లెక్కలు వారివే. ఏ రెండు లెక్కలూ ఒక్కలాగా ఉండటంలేదు. ఇంతకీ ఎంత డబ్బు భారతీయులు విదేశాలకు తరలించి ఉంటారు? సుప్రీం కోర్టు చొరవతో ప్రస్తుతానికి 627 పేర్లు సమర్పించారు. ఈ అంశంలో దీనిని ఓ పెద్ద ముందడుగుగా భావించవచ్చు. నల్లధనానికి సంబంధించి ప్రభుత్వం ఎన్నో శ్వేత పత్రాలు, నివేదికలు వెల్లడించింది. కాని ఏ రెండు లెక్కలు ఒక్కటిగా లేవు. బీజేపీ అగ్రనేత, ఎన్డీఏ హయాంలో ఉప ప్రధానిగా పనిచేసిన లాల్‌కృష్ణ లెక్కల ప్రకారం విదేశాల్లో దాచుకున్న డబ్బు విలువ 28 లక్షల కోట్ల రూపాయలు. అంటే 466 బిలియన్ డాలర్లు. 2011లో ఆయన ఈ లెక్కలు వెల్లడించారు. వాషింగ్టన్కు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ అధ్యయనం ఆధారంగా తాను ఈ లెక్కలు చెప్పినట్టు అద్వానీ తెలిపారు. అంతే కాదు 782 మంది భారతీయులకు విదేశీ బ్యాంకు ఖాతాలున్నాయని అన్నారు. 2011లోనే నల్లధనం విలువ 500 బిలియన్ డాలర్లు నుంచి 1.4 ట్రిలియన్ డాలర్ల మేరకుంటుందని బీజేపీ అంచనా వేసింది. 2012లో భారత ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించిన శ్వేత పత్రంలో స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము విలువ 2.1 బిలియన్ డాలర్లు ఉంటుందని తెలిపింది. 466 బిలియన్ డాలర్లు ఎక్కడ, 2.1 బిలియన్ డాలర్లు ఎక్కడ?. పొంతనేలేదు. స్విస్ బ్యాంకింగ్ అసోసియేషన్ 2006 నివేదికలో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము విలువ 1.46 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని తెలిపింది. అయితే ఈ నివేదికను స్విస్ ప్రభుత్వం కొట్టిపారేసింది. తాము అలాంటి నివేదికేదీ రూపొందించలేదని స్విస్ బ్యాంకర్స్ అసోసియేషన్ ఆ తర్వాత ప్రకటించింది. నల్లధనం వెలికితీసేందుకు ఈ ఏడాది మేలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ అభినందించింది. నల్లధనం భారత్‌కు పెద్ద సమస్యని అభివర్ణించింది. అంతే కాదు 2002 నుంచి 2011 మధ్య కాలంలో 343.9 బిలియన్ డాలర్లు భారత్ నుంచి తరలిపోయాయని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ అంచనా వేసింది. అక్రమంగా డబ్బు తరలింపులో భారత్‌ది ఐదో స్థానమని తెలిపింది. అదే సమయంలో జీడిపీ లెక్కల ప్రకారం అతి పేద పది దేశాల్లో భారత్ ఒకటని గుర్తు చేసింది. ** -
‘నల్ల’కుబేరులపేర్లన్నీ ఇవ్వాల్సిందే!
‘నల్ల’కుబేరుల విషయంలో కేంద్రం వైఖరిపై సుప్రీం ఫైర్ ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారంటూ ఘాటు ప్రశ్న విదేశాల్లో ఖాతాలున్న వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? కొందరి పేర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవద్దు పూర్తి సమాచారం ఇవ్వండి.. మిగిలినదంతా మేం చూసుకుంటాం ఎలా దర్యాప్తు చేయించాలో తమకు తెలుసునని తీవ్ర వ్యాఖ్యలు నేడు సీల్డు కవర్లో సమర్పించాలని కేంద్రానికి ఆదేశం గత తీర్పులో ఒక్క పదాన్ని కూడా మార్చేది లేదని స్పష్టీకరణ పూర్తి జాబితా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కేంద్రం ప్రకటన దాదాపు 500 మంది పేర్లు అందినట్లు వెల్లడించిన అటార్నీ జనరల్ న్యూఢిల్లీ: నల్లకుబేరుల గుట్టును రట్టు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న దాగుడుమూతలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో నల్లధనం ఖాతాలున్న వారి పేర్లన్నింటినీ బుధవారానికల్లా తమకు సీల్డు కవరులో సమర్పించాల్సిందేనని మోదీ సర్కారును మంగళవారం ఆదేశించింది. నల్లకుబేరుల జాబితాగా పేర్కొంటూ ఎనిమిది మంది పేర్లతో కూడిన అఫిడవిట్‌ను సోమవారం సుప్రీంకు కేంద్రం సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఇలా కొంతమంది పేర్లనే వెల్లడించి.. మిగతావారి విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ మంగళవారంనాటి విచారణ సందర్భంగా కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. దీంతో సుప్రీం ఆదేశాలను పాటిస్తామని, తమ వద్దనున్న మొత్తం పేర్లన్నింటితో పూర్తి జాబితాను కోర్టుకు సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు... విదేశాల్లో అక్రమంగా నల్లధనం ఖాతాలున్న వారందరి పేర్లు వెల్లడించాలంటూ సుప్రీం గత తీర్పులో కొన్ని మార్పులు చేయాలంటూ కేంద్రం తన తాజా అఫిడవిట్లో కోరింది. విదేశీ ఖాతాల్లో పన్ను ఎగవేతలకు సంబంధించి తగిన ప్రాథమిక రుజువులు ఉండి, చట్టపరమైన విచారణ(ప్రాసిక్యూషన్)ను ప్రారంభించిన వారి పేర్లను మాత్రమే బహిర్గతం చేస్తామని అందులో పేర్కొంది. ఇదే విషయాన్ని అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గి కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ కేసును విచారిస్తున్న చీఫ్ జస్టిస్(సీజేఐ) హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం కేంద్రం వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అంతేకాదు, ప్రభుత్వ తీరును తీవ్ర పదజాలంతో ఎండగట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘గత యూపీఏ ప్రభుత్వం మా తీర్పును ఆమోదించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్కారు నల్లకుబేరుల విషయంలో ఎందుకు ఈ విధమైన ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోంది. విదేశాల్లో అక్రమంగా బ్యాంకు ఖాతాలున్నవారిని మీరు ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? గతంలో మేం తీర్పును సొలిసిటర్ జనరల్ సమక్షంలోనే వెల్లడించాం. కొత్త ప్రభుత్వం కూడా ఈ తీర్పులో ఎలాంటి మార్పులూ కోరలేదు. ఇప్పుడు మార్పులు అడగడంలో ఔచిత్యమేంటి? మా తీర్పును ఎట్టిపరిస్థితుల్లో సవరించబోం. ఒక్క పదాన్ని కూడా మార్చే ప్రసక్తే లేదు’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ‘మీరేమీ చేయనక్కర్లేదు... విదేశాల్లోని నల్లధనం ఖాతాలకు సంబంధించి మీదగ్గరున్న పేర్లు, సమాచారాన్నంతా కోర్టుకు సమర్పించండి. ఆ తర్వాత దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐ సహా ఎలాంటి సంస్థతో దర్యాప్తు చేయించాలనేది కోర్టు నిర్దేశిస్తుంది’ అని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ధర్మాసనంలో సీజేఐతోపాటు జస్టిస్ రంజనా ప్రకాశ్, జస్టిస్ మదన్ బి లోకూర్‌లు ఉన్నారు. జీవితకాలంలో కూడా దర్యాప్తు పూర్తి చేయలేరు భారతీయుల విదేశీ ఖాతాలకు సంబంధించి ప్రభుత్వానికి దాదాపు 500 మంది పేర్లు అందాయని అటార్నీ జనరల్ ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఇందులో జర్మనీసహా పలు దేశాల్లోని ఖాతాల వివరాలున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో సీజేఐ కల్పించుకొని.. ‘‘మీరు సొంతంగా ఎలాంటి దర్యాప్తూ జరపాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే గనుక దర్యాప్తు చేస్తే నా జీవితకాలంలో కూడా అది పూర్తికాదు. ఖాతాదార్లకు సంబంధించి కేవలం మీదగ్గరున్న సమాచారాన్నంతా మాకివ్వండి. ఏ విధంగా, ఎవరితో దర్యాప్తు జరిపించాలనేది మేం చూసుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఖాతాలున్న భారతీయుల తరుఫున వకాల్తా పుచ్చుకోవద్దని, సిట్ అన్ని విషయాలనూ చూసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది. ఇలా కొందరు ఖాతాదారుల పేర్లను ఇచ్చి చేతులు దులుపుకోవద్దని హితవు పలికింది. మొత్తం జాబితాను బుధవారం నాడు తమ ముందుంచాలని కుండబద్దలు కొట్టింది. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి వదిలేయలేమని కూడా తేల్చిచెప్పడం గమనార్హం. ఒప్పించేందుకు ఏజీ విశ్వప్రయత్నం గత తీర్పులో సవరణకు కోర్టును ఒప్పించేందుకు బలమైన వాదనతో అటార్నీ జనరల్ చాలా ప్రయత్నించారు. ప్రభుత్వం వద్దనున్న మొత్తం పేర్లన్నింటినీ బయటపెడితే.. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించే ప్రయత్నం దెబ్బతినొచ్చన్నారు. ఇతర దేశాలు తమ వద్దనున్న ఖాతాల సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించవచ్చని వాదించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు నియమించిన సిట్ చట్టబద్ధ సంస్థ కాదని, అందువల్ల విదేశీ ఖాతాదారులకు ఎలాంటి నోటీసులూ జారీచేయడం కుదరదని కూడా అటార్నీ వివరించారు. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ద్వారానే ఇది సాధ్యమవుతుందని.. ఇప్పటికే సమాచారాన్నంతా సిట్‌కు ఇచ్చినట్లు కూడా ఆయన తెలిపారు. అయితే, ఆయన వాదనలపట్ల ధర్మాసనం సంతృప్తి చెందలేదు. ‘విదేశాలు ఇచ్చిన ఖాతాదారుల పేర్లన్నీ మాకు కావాలి. ఆ సమాచారాన్ని మాకు ఇవ్వండి. ఈ కేసును మేం టేకప్ చేసి(సిట్‌కు బదలాయించి).. దాని పర్యవేక్షణను కూడా మేమే చూస్తాం. అంతిమంగా సిట్ ఈ అంశానికి తగిన ముగింపునిస్తుంది. ఈ విషయంలో మీకొచ్చిన ఇబ్బందేంటి?’ అని ప్రశ్నించింది. అయితే, ఖాతాల వివరాల వెల్లడి విషయంలో గోప్యత పాటిస్తామని విదేశీ ప్రభుత్వాలు, సంస్థలకు ప్రభుత్వం హామీనిచ్చిందని కూడా ఏజీ రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఒకవేళ అనాలోచితంగా బహిర్గతం చేస్తే... విదేశాలతో పన్ను ఒప్పందాల విషయంలో సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో సమాచార మార్పిడికీ ఇబ్బందులు తప్పవని రోహత్గీ వాదించారు. అయితే, అలాంటి హామీలేవీ మీరు(ప్రభుత్వం) ఇవ్వొద్దని, మన దేశానికి చెందిన సొమ్మును విదేశాలకు తరలించుకుపోతుంటే మేం చూస్తూ ఊరుకోలేమని కోర్టు తేల్చిచెప్పింది. దీనికోసమే సిట్‌ను ఏర్పాటు చేశామని, అలాంటి ఇబ్బందులేవైనా తలెత్తితే అది చూసుకుంటుందని, ప్రభుత్వం ఇందుకు సహకరించాలని కూడా ధర్మాసనం కుండబద్దలు కొట్టడం గమనార్హం. చిత్తశుద్ధితో ఉన్నాం నల్లధనాన్ని భారత్‌కు తిరిగి రప్పించడంలో తమ ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉందని, ఈ విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని కేంద్రం పేర్కొంది. ఇందుకు దౌత్యపరంగా, చట్టపరంగా అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటామని కూడా సుప్రీంకు సమర్పించిన 16 పేజీల అఫిడవిట్లో కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. విదేశాల్లో భారతీయులకున్న ప్రతి ఖాతా అక్రమమైనది కాదని కూడా తెలిపింది. ప్రాసిక్యూటబుల్(చట్టప్రకారం విచారణకు అర్హమైన) కేసుల్లో మరింత మంది నల్లకుబేరుల పేర్లను బహిర్గతం చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రమోటర్ల కుటుంబానికి చెందిన ప్రదీప్ బర్మన్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది నల్లకుబేరుల పేర్లను సోమవారం కేంద్రం బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో రాజ్‌కోట్‌కు చెందిన బులియన్ ట్రేడర్ పంకజ్ చిమన్లాల్ లోధియా, గోవా మైనింగ్ కంపెనీ టింబ్లో ప్రైవేట్ లిమిటెడ్, దాని డెరైక్టర్ రాధా సతీశ్ టింబ్లోతో పాటు మరో నలుగురు డెరైక్టర్లు కూడా జాబితాలో ఉన్నారు. అయితే, తమపై వచ్చిన ఆరోపణలను వీళ్లంతా ఖండించారు. ఇక విదేశాల్లో తమకు ఎలాంటి నల్లధనం ఖాతాలూ లేవని టింబ్లో ప్రైవేటు లిమిటెడ్ డెరైక్టర్ రాధా ఎస్ టింబ్లో మంగళవారం వివరణ ఇచ్చారు. అఫిడవిట్‌లోని అంశాలు కోర్టు పరిధిలోకి వెళ్లాయంటూనే.. తమ వరకైతే అన్ని పన్నులనూ సక్రమంగా చెల్లిస్తున్నామని ఆమె చెప్పారు. జాబితా నేడు సమర్పిస్తాం: జైట్లీ నల్లధనం ఖాతాదారుల పేర్లతో కూడిన జాబితానంతటినీ బుధవారం సమర్పిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరణ ఇచ్చారు. ‘ఎవ్వరినీ కాపాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. సుప్రీం చెప్పినట్లుగా సీల్డు కవర్లో జాబితాను ఇచ్చేస్తాం. ఇప్పటికే ఈ లిస్టును సుప్రీం నియమించిన సిట్‌కు జూన్ 27నే సమర్పించాం. మేం చట్టప్రకారం నడుచుకుంటాం. కోర్టుకు కూడా జాబితా ఇవ్వడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదు’ అని జైట్లీ తేల్చిచెప్పారు. అయితే, ఈ పేర్లన్నింటినీ ప్రభుత్వం ప్రజలకు బహిర్గతం చేస్తుందా లేదా అనేది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా, విదేశాల్లో అక్రమంగా నల్లధనం పోగేసిన ఖాతాదారులందరినీ శిక్షించాలన్న దృఢనిశ్చయంతో ప్రభుత్వం ఉందని.. నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు సాయశక్తులా కృషిచేస్తామని కూడా జైట్లీ పేర్కొన్నారు. ‘జాబితాలో పేర్లున్న వారి నిగ్గు తేల్చాల్సిందే. అప్పుడే నల్లధనాన్ని స్వదేశానికి తిరిగి తెచ్చేందుకు వీలవుతుంది. ఏ సంస్థతో దర్యాప్తు జరిపించినా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ నల్ల మహమ్మారి విషయంలో ఎవరినీ వదలిపెట్టకుండా.. చట్టప్రకారం శిక్షించాలన్న చిత్తశుద్ధితో మా ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. -
గడగడలాడుతున్న నల్ల కుబేరులు!
నల్ల కుబేరుల జాబితా మొత్తం బయట పెట్టాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఇప్పుడు దేశమంతా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. పలువురు వ్యాపారులు, రాజకీయ నేతలు విదేశీ బ్యాంకులలో లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ముగ్గురు వ్యాపారుల పేర్లను మాత్రమే కేంద్రం సమర్పించడంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం నాటికి పూర్తి జాబితా వెల్లడించాలని ఆదేశించింది. దీంతో అందరి పేర్లను కేంద్రం రేపు సుప్రీంకోర్టు ముందు ఉంచనుంది. ఆ నల్ల కుబేరులు ఎవరన్నది బయటి ప్రపంచానికి తెలియకున్నా, విదేశాలలో డబ్బులు దాచుకున్న వారు మాత్రం గడగడలాడిపోతున్నారు. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనంపై గడచిన రెండున్నర దశాబ్దాలుగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఎనిమిది మంది పేర్లను కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో మరో 22 మంది పేర్లు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతనొక హోటల్ వ్యాపారి. దేశం నలుమూలలా అతని హోటల్ సామ్రాజం విస్తరించి ఉంది. అలాంటి వ్యక్తికి విదేశాల్లో 25 అకౌంట్లు వున్నాయి. ఆయా బ్యాంక్ ఖాతాల్లో లక్షా 45 వేల 600 కోట్లు దాచుకున్నారు. టెలికం దిగ్గజంగా పేరుగాంచిన ఓ దక్షిణాది సీనియర్ రాజకీయ నేత కూడా విదేశాల్లో అకౌంట్లు ఆపరేట్ చేస్తున్నారు. ఒకటీ రెండు కాదు ఏకంగా 15 బ్యాంక్ ఖాతాల ద్వారా ఆయన తన లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఆ నేత విదేశాల్లో దాచుకున్న సొత్తు 15 వేల కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. మరో వ్యక్తి విషయానికొస్తే, దేశవ్యాప్తంగా చైన్‌లింక్‌తో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇండియా మొత్తంగా పలు హాస్పిటల్స్ నడిపిస్తున్నారు. ఆయన విదేశాల్లో రెండు అకౌంట్లు ఆపరేట్ చేస్తున్నారు. ఆయన అకౌంట్లో 28 వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఓ కేంద్ర మాజీ మంత్రి కూడా విదేశాల్లో రెండు అకౌంట్లు నిర్వహిస్తున్నారు. అకౌంట్స్‌లో 14 వేల 500 కోట్ల రూపాయలు వున్నట్లుతెలుస్తోంది. యూత్ కాంగ్రెస్ నేతగా పలువురికి పరిచయమైన మరో కేంద్ర మాజీ మంత్రికి కూడా విదేశీ ఖాతాలు ఉన్నారు. ఆ నేతకు విదేశాల్లో ఐదు అకౌంట్లు వున్నట్లు తెలుస్తోంది. ఆయా అకౌంట్లలో 9 వేల కోట్ల రూపాయలు వున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి ఒకరికి విదేశీ బ్యాంకులలో రెండు ఖాతాలు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు అకౌంట్లలో 29 వేల 800 కోట్ల రూపాయలు దాచుకున్నట్లు తెలుస్తోంది. మరో మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఇద్దరికి 10 అకౌంట్లు వున్నట్లు సమాచారం. ఆయా అకౌంట్లలో 10 వేల 500 కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా హోటల్స్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కూడా విదేశాల్లో ఒక బ్యాంక్ ఖాతా ఓపెన్ చేశారు. ఈ ఖాతాలో 4 వేల 520 కోట్లు దాచుకున్నట్లు తెలుస్తోంది. ఇంకో మాజీ ముఖ్యమంత్రి కూడా తన విదేశీ బ్యాంకు అకౌంట్లో 8 వేల 200 కోట్ల రూపాయలు దాచినట్లు సమాచారం. వివాదాస్పదుడిగా ముద్రపడిన తమిళనాడుకు చెందిన మాజీ కేంద్ర మంత్రి ఖాతాలో 7 వేల 800 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ స్టాక్‌మార్కెట్ బ్రోకర్ ఆపరేట్ చేస్తున్న 5 ఖాతాలలో 3 వేల 900 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. మరో స్టాక్ మార్కెట్ మాయాజాలకుడు 13 ఖాతాలు ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఖాతాలలో లక్షా 35 వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పది ఖాతా నెంబర్లు, ఆ ఖాతాలలో ఉన్న నగదు వివరాలు వెల్లడయ్యాయి. తెలిసిన సమాచారం ప్రకారం ఏ ఏ ఖాతా నెంబర్లో ఎంతెంత నగదు దాచుకున్నారో ఆ వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. అయితే ఆ ఖాతాదారుల పేర్లు మాత్రం బయటకు రాలేదు. ఖాతా నెంబర్ నిల్వ ఉన్న నగదు 1. IN 155869-256648-102011 : రూ.లక్షా 98 వేల 356 కోట్లు 2. IN 959666-021465-255614 : లక్షా 35 వేల 121 కోట్లు 3.IN 256689-1025-125488 : రూ. 7 వేల 856 కోట్లు 4. IN 121668-1254588-125448 : రూ. 28 వేల 956 కోట్లు 5. IN 252684-451215-125683 : రూ. 33 వేల 451 కోట్లు 6. IN 656448-120201-235454 : రూ. 5 వేల 560 కోట్లు 7. IN 918541-231548-412587 : రూ 35 వేల 9 కోట్లు 8. IN 856479-265689-412458 : రూ.8 వేల 256 కోట్లు 9.IN 102012-128458-105555 : రూ. 96 వేల 455 కోట్లు 10. IN 254122-457895-124512 : రూ.15 వేల 90 కోట్లు ** -
'నల్ల' జాబితాలోని అన్ని పేర్లు బయటపెట్టండి: సుప్రీం
-
'నల్ల' జాబితాలోని అన్ని పేర్లు బయటపెట్టండి: సుప్రీం
న్యూఢిల్లీ: నల్ల కుబేరుల జాబితాను వెల్లడి అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న బ్లాక్ మనీ జాబితాలోని ముగ్గురి పేర్లను మాత్రమే కేంద్రం వెల్లడించడంపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రేపటికల్లా జాబితాలోని అందరి పేర్లను బహిర్గతం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో బుధవారం సుప్రీం కోర్టుకు ఓ నివేదిక ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది. విదేశాల్లో డబ్బు దాచిన వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారని మోడీ సర్కార్ పై కేంద్ర మండిపడింది. నల్లధనాన్ని వెనక్కి తెచ్చే వ్యవహారాన్ని ప్రభుత్వానికి విడిచిపెట్టలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. నిర్దేశిత సమయంలోగా ఆ పని ఎప్పటికి పూర్తి కాదని సుప్రీం కోర్టు తెలిపింది. -
నల్లధనం విషయంలో రాజకీయవేత్తల సంగతేంటీ?
-
విదేశీ బ్యాంకు ఖాతాలు లేవు: ప్రణీత్ కౌర్
న్యూఢిల్లీ: విదేశాల్లో తనకు బ్యాంకు ఖాతాలు లేవని కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ స్పష్టం చేశారు. విదేశాల్లో నల్లధనం దాచారనే ఆరోపణలతో తనపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆమె స్పందించారు. తన పేరుతో విదేశీ బ్యాంకు ఖాతా ఉన్నందుకు ఆదాయపన్ను తనకు నోటీసు పంపిందని ఆమె తెలిపారు. అయితే విదేశాల్లో తనకు ఎటువవంటి బ్యాంకు ఖాతాలు లేవని ఆమె తెలిపారు. తన పేరుతో విదేశీ బ్యాంకుల్లో ఎకౌంట్లు లేవని కూడా చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్ భార్య అయిన ప్రణీత్ కౌర్- మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ సహాయ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి నలుగురు బడా నాయకులకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రణీత్ కౌర్ పేరు ఇప్పటికే బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి ఇద్దరు ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. బ్లాక్‌మనీ లిస్టులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద తలకాయల పేర్లు ఉన్నాయని గతవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బ్లాక్ మనీ వ్యవహారంలో కాంగ్రెస్‌కు షాక్
-
నల్లకుబేరుల పేర్లను వెల్లడించొద్దు: అసోచామ్
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న భారతీయుల పేర్లను ప్రభుత్వం అనాలోచితంగా వెల్లడించరాదని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. నల్లకుబేరుల బండారాన్ని బయటపెట్టాలని రాజకీయంగా డిమాండ్లు జోరందుకున్న నేపథ్యంలో అసోచామ్ వాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందాలు(డీటీఏటీ) అటు భారతీయ పౌరులకు, కార్పొరేట్లకు చాలా ముఖ్యమని.. దీనివల్ల రెండుసార్లు పన్నులు చెల్లించే పరిస్థితి తప్పుతుందని అసోచామ్ తెలిపింది. ‘ఎలాంటి లెక్కలూ చూపకుండా విదేశాల్లో సొమ్ముదాచుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి వ్యక్తుల పేర్లను బహిర్గతం చేయడం వల్ల నల్లధనంపై పోరాటానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. డీటీఏటీలో ఉల్లంఘనల వల్ల భారత్ విశ్వసనీయత దెబ్బతింటుంది. ఒకవేళ ప్రభుత్వం వెల్లడించిన వ్యక్తులు, కంపెనీలపై ఆరోపణలు రుజువు కాకపోతే వాళ్ల ప్రతిష్టకు భంగం వాటిల్లడమేకాకుండా... భారత్‌లోని చట్టాలపైన కూడా నమ్మకం సన్నగిల్లేందుకు దారి తీస్తుంది’ అని అసోచామ్ అభిప్రాయపడింది. సరైన సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శక పన్నుల విధానం వంటి వ్యవస్థీకృత మార్పుల ద్వారా ఈ నల్లధనం జాడ్యానికి అడ్డుకట్టవేయొచ్చని పేర్కొంది. నల్లకుబేరులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని.. వాళ్ల పేర్లను బయటపెడతామంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం తెలిసిందే. -
కాంగ్రెస్ పార్టీ కలవరపడదు: చిదంబరం
బ్లాక్‌మనీ జాబితా బయటపడితే కాంగ్రెస్‌కే ఇబ్బందన్న జైట్లీ వ్యాఖ్యలపై చిదంబరం ఒకవేళ పార్టీ నేత ఉంటే ఆ వ్యక్తే ఇబ్బందిపడతారు న్యూఢిల్లీ: విదేశాల్లోని బ్యాంకుల్లో నల్లధనం దాచిన భారతీయుల జాబితా బయటపడితే కాంగ్రెస్ పార్టీకి కలవరపాటు తప్పదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం శుక్రవారం కొట్టిపారేశారు. ఆ జాబితాలో తమ పార్టీకి చెందిన నేత, నాటి యూపీఏ మంత్రి ఉండొచ్చన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అయితే ఒకవేళ నిజంగా తమ పార్టీ నేత పేరు బయటపడినా అది ఆ వ్యక్తికే ఇబ్బంది కలిగిస్తుంది తప్ప పార్టీకి కాదని స్పష్టం చేశారు. ‘‘ఇవన్నీ (నల్లధనం దాచుకోవడం) వ్యక్తిగత స్థాయిలో జరిగిన చట్టాల ఉల్లంఘనలు. ఒకవేళ నల్ల కుబేరుల పేర్లు బహిర్గతమైతే ఆ వ్యక్తే ఇబ్బంది పడతారు. ఇందులో పార్టీ కలవరానికి గురికావాల్సినది ఏముం ది? అతనేమీ పార్టీ ఖాతా సొమ్మును దాచలేదు కదా. అలాగే అతన్ని నల్లధనం దాచుకోవాలని పార్టీ చెప్పలేదుగా’’ అని ఎన్డీటీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం పేర్కొన్నారు. నల్లధనం దాచిన వారి పేర్లను వెల్లడించలేమంటూ మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం ఈ విషయంలో బీజేపీ తీసుకున్న గత వైఖరి నుంచి వెనకడుగు వేయడమేనని చిదంబరం విమర్శించారు. నల్ల కుబేరుల పేర్ల బహిర్గతం సాధ్యంకాదంటూ తమ పార్టీ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపినప్పుడు బీజేపీ తమను విమర్శించిందని గుర్తుచేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికలతోపాటు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలవడంతో క్యాడర్లో ఆత్మస్థైర్యం తగ్గిందన్న మాట వాస్తవమేనని చిదంబరం అంగీకరించారు. అయితే అంతమాత్రాన క్యాడర్లో ఉత్సాహం నింపడం ఇప్పట్లో సాధ్యం కాదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ఎక్కువ సభల్లో మాట్లాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడు కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. -
భారత్‌కు ‘బ్లాక్‌మనీ’ లెక్కలు
-
భారత్‌కు ‘బ్లాక్‌మనీ’ లెక్కలు
సమాచారాన్ని అందించిన న్యూజిలాండ్, యూకే, స్పెయిన్ న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో పన్ను ఎగవేతకు, అనుమానాస్పద నిధులకు సంబంధించిన.. 24 వేల ఉదంతాల సమాచారాన్ని భారత్ సంపాదించింది. విదేశీ బ్యాంకుల్లోని భారతీయులకు సంబంధించిన ఆ సమాచారాన్ని న్యూజిలాండ్, యూకే, స్పెయిన్ సహా దాదాపు డజను దేశాలు అందించాయి. ఆ సమాచారాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు అధికారులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణ ఫలితాల కోసం బ్లాక్‌మనీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదురుచూస్తోంది. భారత్‌కు చేరిన సమాచారంలో ఎక్కువ భాగం న్యూజీలాండ్ నుంచి(10,372 ఉదంతా లు), స్పెయిన్(4,169), యూకే(3,164), స్వీడన్(2,404), డెన్మార్క్(2,145) దేశాల నుంచి వచ్చింది. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, పన్ను సమాచార మార్పిడి ఒప్పందం ఆధారంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ సమాచారాన్ని సేకరించింది. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ రూపొందించిన నిబంధనలకింద దేశాల మధ్య పన్ను సమాచార మార్పిడి జరుగుతుంది. చట్టాన్ని సవరించిన స్విట్జర్లాండ్ బెర్న్: స్విస్ బ్యాంకుల్లోని విదేశాలకు చెందిన నల్లధనం వివరాలను వెల్లడించే దిశగా సంబంధిత చట్టానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. భారత్ సహా పలు దేశాల ఒత్తిడికి తలొగ్గి చేసిన ఆ సవరణలు ఈ నెలనుంచే అమల్లోకి రానున్నాయి. వాటి ప్రకారం.. భారత్ సహా ఆయా దేశాలు తమ దేశస్తుల బ్లాక్‌మనీ ఖాతాల వివరాలు, వాటిని నిర్వహిస్తున్న వారి వివరాలను కోరినపుడు.. ఆ అకౌంట్హోల్డర్లకు దీనికి సంబంధించిన ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆయా దేశాలడిగిన సమాచారాన్ని ఇవ్వాలి. అయితే, ఆ హోల్డర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకూడదనడానికి కారణాన్ని సమాచారం అడిగిన దేశాలు చూపాలి. ఈ సవరణకు ముందు.. ‘ఫలానా దేశం మీ అకౌంట్ వివరాలను కోరింద’ంటూ ముందుగా ఆ అకౌంట్హోల్డర్లకు సమాచారమిచ్చి, వారికి తమ అకౌంట్లను సరిచూసుకునేందుకు, లేదంటే సమాచార మార్పిడిని వ్యతిరేకించేందుకు అవకాశమిచ్చే పరిస్థితి ఉండేది. ఈ సవరణలతో నల్లధనాన్ని భారత్‌కు తెప్పించేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రోత్సాహం లభించినట్లైంది. -
నల్లధనాన్ని వెలికితీయండి:అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో భారత కుబేరులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర సర్కారు స్వదేశంలో పోగుబడిన నల్లధనంపై కూడా కసరత్తులు ఆరంభించింది. దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీయాలని ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారులను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆదేశించారు. ‘‘విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అలాగే, దేశంలోపల దాగి ఉన్న నల్లధనాన్ని కూడా వెలికి తీసేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కషి చేయాలి’’ అంటూ జైట్లీ పేర్కొన్నారు. ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారుల 30వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విధించిన లక్ష్యాలను అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.7,36,221 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆదాయపన్ను అధికారులు అత్యున్నత విలువలతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. -
'చంద్రబాబుకు విదేశీ బ్యాంకుల్లో 2వేల కోట్లు'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు విదేశీ బ్యాంకుల్లో 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కోలా కృష్ణమోహన్ ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తనవద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిని సీబీఐకి అందజేస్తానని అన్నారు. తనకు కేవలం 47 కోట్లే ఉన్నాయంటూ ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన విషయం పచ్చి అబద్ధమని, దీనిపై తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్.. గతంలో ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, వాళ్లిద్దరికీ ఒక అబ్బాయి కూడా ఉన్నాడని కోలా కృష్ణమోహన్ ఆరోపించారు. లోకేష్ చేతిలో మోసపోయిన అమ్మాయి మరో రెండు రోజుల్లో మీడియా ముందుకు కూడా వస్తుందని ఆయన చెప్పారు. -
ప్రాధాన్యతా రంగంలోకి మధ్యతరహా యూనిట్ల రుణాలు
ముంబై: ఈ నెల 13 తరువాత మధ్యతరహా తయారీ సంస్థలకు కేటాయించిన రుణాలను ప్రాధాన్యతా రంగంకింద చేర్చుతూ రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతోపాటు సూక్ష్మ, చిన్న తరహా యూనిట్లకు ఇచ్చే రుణ పరిమితిని రెట్టింపునకు అంటే రూ. 10 కోట్లకు పెంచుతూ బ్యాంకులకు మార్గదర్శకాలను జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి చివరి వరకూ ఈ ఆదేశాలు అమలు కానున్నాయి. ఈ రెండు మార్పులూ 2014 మార్చి 31 వరకూ అమల్లో ఉంటాయని పేర్కొంది. విదేశీ డబ్ల్యూఓఎస్ బ్యాంకులకు సీజీటీ మినహాయింపు దేశంలో పూర్తి స్థాయి అనుబంధ బ్యాంకులుగా (డబ్ల్యూఓఎస్) రూపాంతరం చెందే ప్రస్తుత విదేశీ బ్యాంకు బ్రాంచీలకు ఆర్బీఐ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ తరహా డబ్ల్యూఓఎస్లపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (సీజీటీ)గానీ లేదా స్టాంప్ డ్యూటీ గానీ విధించడం జరగదని పేర్కొంది. -
అధికారమిస్తే.. నల్లధనం తెప్పిస్తాం!
జైపూర్/బికనూర్(రాజస్థాన్): బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే విదేశీ బ్యాంకుల్లోని నల్లధనాన్ని తిరిగి తెప్పించేందుకు చట్టం రూపొందిస్తామని ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రకటించారు. అవినీతిపరులు విదేశాల్లో డబ్బులు దాచుకోవడాన్ని అడ్డుకోవడమే బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంటుందన్నారు. జుంజ్హును జిల్లా ఖేత్రీలో, బికనూర్ డివిజన్లో మోడీ సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై మోడీ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ పనితీరును ఎన్డీఏ హయాంతో పోలుస్తూ విమర్శలు సంధించారు. ‘అటల్జీ అణు పరీక్షలు నిర్వహించారు. ప్రపంచం షాక్ తిని ఆంక్షలు విధించింది. అయినా ఆయన రూపాయి విలువను పడిపోనివ్వలేదు. అప్పుడు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది. ఇప్పుడు ఆర్థికవేత్తయిన ప్రధాని పాలనలో ఏం జరుగుతోందో చూడండి.. రూపాయి ఐసీయూలో ఉంది’ అని అన్నారు. యూపీఏ ప్రభుత్వం పాకిస్థాన్‌తో వ్యవహరిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు. ‘ఒకవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యం మన సైనికులను దారుణంగా చంపుతూ ఉంటే.. మరోవైపు ఆ దేశ ప్రధానికి మన దగ్గర విందు ఏర్పాటు చేస్తారు’ అన్నారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘గుజరాత్, రాజస్థాన్‌లకు సారూప్యత ఉంది. ఇక్కడా ఎడారి ఉంది. వర్షాలు తక్కువ. అయితే మేం 900 గ్రామాలకు, సరిహద్దులోని సైనికులకు మంచినీరు ఇవ్వడానికి కోట్లు ఖర్చు చేసి పైప్‌లైన్ వేశాం. అదెంత పెద్దదంటే గెహ్లాట్ , ఆయన కుటుంబం మారుతీ కారులో కూర్చుని వెళ్లేటంత పెద్దది’ అని అన్నారు. -
బ్యాంకింగ్‌లో సంస్కరణల మోత!
వాషింగ్టన్: బ్యాంకింగ్ రంగంలో త్వరలో భారీ సంస్కరణలను తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. విదేశీ బ్యాంకులు భారత్‌లోకి పెద్దయెత్తున ప్రవేశించేందుకు వీలవడంతోపాటు దేశీ బ్యాంకులను కొనుగోలు చేసేందుకు కూడా దోహదం చేసేలా ఈ సంస్కరణలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ నిర్వహించిన కార్యక్రమంలో రాజన్ మాట్లాడారు. భారత్‌లోకి విదేశీ బ్యాంకుల ప్రవేశానికి సంబంధించి విధానపరమైన కార్యాచరణను వచ్చే కొద్దివారాల్లో ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. విదేశీ బ్యాంకులకు కూడా దాదాపు దేశీ బ్యాంకుల స్థాయిలోనే అనుమతులు ఇస్తామని, అయితే ఇందుకు రెండు షరతులు వర్తిస్తాయని రాజన్ పేర్కొన్నారు. ‘విదేశీ బ్యాంకులకు భారత్ ఏవిధంగా అనుమతులు ఇస్తుందో.. అదేవిధంగా ఆయా దేశాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఇక రెండోది... ఏదైనా విదేశీ బ్యాంక్ భారత్‌లో బ్రాంచ్‌ల ఏర్పాటు రూట్, అనుబంధ సంస్థ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు... రెండింటిలో ఏదోఒక విధానాన్నే ఎంచుకోవాలి. నియంత్రణ ప్రక్రియ సరళీకరణ, పారదర్శకతే మా ఉద్దేశం’ అని రాజన్ వివరించారు. పరపతి విధానానికి ధరలే ప్రాతిపదిక... ఆర్బీఐ సాధారణ పరపతి విధాన సమీక్షలో ఎప్పుడూ ధరల పరిస్థితినే పరిగణనలోకి తీసుకుంటామని రాజన్ చెప్పారు. ఈ నెల 29న ఆర్బీఐ రెండో త్రైమాసిక పాలసీ సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అమెరికా షట్డౌన్పై..: అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాల మూసివేత(షట్‌డౌన్)పై స్పందిస్తూ... అక్కడి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేంత పరిస్థితులేవీ లేవని రాజన్ అభిప్రాయపడ్డారు. అక్కడి ఎకానమీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, యూఎస్ బాండ్(ట్రెజరీ బిల్స్)లలో భారత్ పెట్టుబడులను(దాదాపు 59.1 బిలియన్ డాలర్లు) విక్రయించే అవకాశమే లేదన్నారు. నేనేమీ సూపర్‌మేన్‌ను కాదు ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడంపై ప్రపంచవ్యాప్తంగా మీడియా వ్యాఖ్యానాలపై రాజన్ తనదైన శైలిలో స్పందించారు. ‘నా కొత్త బాధ్యతలపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కొంత అమితోత్సాహం నెలకొంది. నాపై అంచనాలు కూడా చాలా అధికంగానే ఉన్నాయి. అయితే, నేనేమీ సూపర్‌మేన్‌ను కాదని మీకు స్పష్టం చేయదలచుకున్నా’ అన్నారు. రాజన్‌ను మీడియా ‘రాక్‌స్టార్’గా అభివర్ణించడం తెలిసిందే.