గడగడలాడుతున్న నల్ల కుబేరులు! | Terror to black billionaires! | Sakshi
Sakshi News home page

గడగడలాడుతున్న నల్ల కుబేరులు!

Published Tue, Oct 28 2014 6:42 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

గడగడలాడుతున్న నల్ల కుబేరులు! - Sakshi

గడగడలాడుతున్న నల్ల కుబేరులు!

నల్ల కుబేరుల జాబితా మొత్తం బయట పెట్టాలని  సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఇప్పుడు దేశమంతా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. పలువురు వ్యాపారులు, రాజకీయ నేతలు విదేశీ బ్యాంకులలో లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నట్లు తెలుస్తోంది.  కేవలం ముగ్గురు  వ్యాపారుల పేర్లను మాత్రమే కేంద్రం సమర్పించడంతో  సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  బుధవారం నాటికి పూర్తి జాబితా  వెల్లడించాలని  ఆదేశించింది. దీంతో అందరి పేర్లను కేంద్రం రేపు సుప్రీంకోర్టు ముందు ఉంచనుంది.  ఆ నల్ల కుబేరులు ఎవరన్నది బయటి ప్రపంచానికి తెలియకున్నా, విదేశాలలో డబ్బులు దాచుకున్న వారు మాత్రం గడగడలాడిపోతున్నారు. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనంపై గడచిన రెండున్నర దశాబ్దాలుగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇప్పటికే ఎనిమిది మంది పేర్లను కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో మరో 22 మంది పేర్లు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతనొక హోటల్‌ వ్యాపారి. దేశం నలుమూలలా అతని హోటల్‌ సామ్రాజం విస్తరించి ఉంది. అలాంటి వ్యక్తికి విదేశాల్లో 25 అకౌంట్లు వున్నాయి. ఆయా బ్యాంక్‌ ఖాతాల్లో లక్షా 45 వేల 600 కోట్లు దాచుకున్నారు. టెలికం దిగ్గజంగా పేరుగాంచిన ఓ దక్షిణాది సీనియర్‌ రాజకీయ నేత కూడా విదేశాల్లో అకౌంట్లు ఆపరేట్‌ చేస్తున్నారు. ఒకటీ రెండు కాదు ఏకంగా 15 బ్యాంక్‌ ఖాతాల ద్వారా ఆయన తన లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఆ నేత విదేశాల్లో దాచుకున్న సొత్తు 15 వేల కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

మరో వ్యక్తి విషయానికొస్తే, దేశవ్యాప్తంగా చైన్‌లింక్‌తో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇండియా మొత్తంగా పలు హాస్పిటల్స్‌ నడిపిస్తున్నారు. ఆయన విదేశాల్లో రెండు అకౌంట్లు ఆపరేట్‌ చేస్తున్నారు. ఆయన అకౌంట్‌లో 28 వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఓ  కేంద్ర మాజీ మంత్రి కూడా విదేశాల్లో రెండు అకౌంట్లు నిర్వహిస్తున్నారు. అకౌంట్స్‌లో 14 వేల 500 కోట్ల రూపాయలు వున్నట్లుతెలుస్తోంది. యూత్‌ కాంగ్రెస్‌ నేతగా పలువురికి పరిచయమైన మరో  కేంద్ర మాజీ మంత్రికి కూడా విదేశీ ఖాతాలు ఉన్నారు.  ఆ నేతకు విదేశాల్లో ఐదు అకౌంట్లు వున్నట్లు తెలుస్తోంది. ఆయా అకౌంట్లలో 9 వేల కోట్ల రూపాయలు వున్నట్లు సమాచారం.

 మాజీ ముఖ్యమంత్రి ఒకరికి విదేశీ బ్యాంకులలో రెండు ఖాతాలు ఉన్నట్లు సమాచారం.  ఈ రెండు అకౌంట్లలో 29 వేల 800 కోట్ల రూపాయలు  దాచుకున్నట్లు తెలుస్తోంది. మరో మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఇద్దరికి 10 అకౌంట్లు వున్నట్లు సమాచారం. ఆయా అకౌంట్లలో 10 వేల 500 కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా హోటల్స్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కూడా విదేశాల్లో ఒక బ్యాంక్‌ ఖాతా ఓపెన్‌ చేశారు. ఈ ఖాతాలో 4 వేల 520 కోట్లు దాచుకున్నట్లు తెలుస్తోంది. ఇంకో మాజీ ముఖ్యమంత్రి  కూడా తన విదేశీ బ్యాంకు అకౌంట్‌లో 8 వేల 200 కోట్ల రూపాయలు దాచినట్లు సమాచారం.

వివాదాస్పదుడిగా ముద్రపడిన తమిళనాడుకు చెందిన మాజీ కేంద్ర మంత్రి ఖాతాలో 7 వేల 800 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.  ఓ స్టాక్‌మార్కెట్‌ బ్రోకర్‌  ఆపరేట్‌ చేస్తున్న 5 ఖాతాలలో  3 వేల 900 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. మరో స్టాక్‌ మార్కెట్‌ మాయాజాలకుడు 13 ఖాతాలు ఆపరేట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఖాతాలలో లక్షా 35 వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు  పది ఖాతా నెంబర్లు, ఆ ఖాతాలలో ఉన్న నగదు వివరాలు వెల్లడయ్యాయి.  తెలిసిన సమాచారం ప్రకారం ఏ ఏ ఖాతా నెంబర్లో ఎంతెంత నగదు దాచుకున్నారో ఆ వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. అయితే ఆ ఖాతాదారుల పేర్లు మాత్రం బయటకు రాలేదు.

ఖాతా నెంబర్‌                                        నిల్వ ఉన్న నగదు
1. IN 155869-256648-102011 :  రూ.లక్షా 98 వేల 356 కోట్లు
2. IN 959666-021465-255614 : లక్షా 35 వేల 121 కోట్లు
3.IN 256689-1025-125488        : రూ. 7 వేల 856 కోట్లు
4. IN 121668-1254588-125448 : రూ. 28 వేల 956 కోట్లు
5. IN 252684-451215-125683 : రూ. 33 వేల 451 కోట్లు
6. IN 656448-120201-235454 : రూ. 5 వేల 560 కోట్లు
7. IN 918541-231548-412587 : రూ 35 వేల 9 కోట్లు
8. IN 856479-265689-412458 : రూ.8 వేల 256 కోట్లు
9.IN 102012-128458-105555 : రూ. 96 వేల 455 కోట్లు
10. IN 254122-457895-124512  : రూ.15 వేల 90 కోట్లు
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement