black billionaires
-
మార్కెట్ విలువపైనే పన్ను వడ్డన
న్యూఢిల్లీ: దేశంలో నల్ల కుబేరులకు చెక్ పెట్టేందుకు కఠిన నిబంధనలతో రూపొందించిన ‘బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, ఆస్తుల(కొత్త పన్ను విధింపు) బిల్లు-2015’లో ప్రభుత్వం కీలక నిబంధనను పొందుపరిచింది. ప్రభుత్వానికి వెల్లడించని విదేశీ ఆస్తులపై భారతీయులు చెల్లించాల్సిన పన్ను, జరిమానాను ఆస్తి కొనుగోలు ధరపై కాకుండా మార్కెట్ విలువ ప్రాతిపదికన చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆస్తి కొనుగోలుపై పాక్షిక వివరాలు చెప్పి ఉంటే పన్ను, జరిమానా చెల్లింపులో ఆ అంశాన్ని ప్రతిపాదిత చట్టం పరిగణనలోకి తీసుకోనుంది. విదేశీ ఆస్తులపై ఆదాయాన్ని చూపని వారికి గరిష్టంగా ఏడేళ్ల కఠిన జైలు శిక్ష విధించేలా ప్రభుత్వం బిల్లులో నిబంధనను పొందుపరిచింది. అతిత్వరలో చర్చలు: స్విస్ జెనీవా: నల్లధనంపై సమాచార మార్పిడికి సం బంధించి త్వరలో భారత్‌తో చర్చలు ప్రారంభిస్తామని స్విట్జర్లాండ్ తెలిపింది. తమకు చట్టపరమైన అనుమతులు లభించగానే భారత్‌తో చర్చల మొదలుపెడతామంది. -
‘నల్ల’ కుబేరులను శిక్షించాలి
-
‘నల్ల’ కుబేరులను శిక్షించాలి
⇒ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి ⇒ వారసుల ఆస్తులపై పన్నులు వేయటం సరికాదు ⇒ సర్కారు బలంగా ఉన్నంత మాత్రాన మేలు జరగదు ⇒ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు పనాజీ: చట్టాలను క్రమబద్ధీకరించడం, పటిష్టంగా అమలు చేయడం ద్వారా నల్లధనం కుబేరులను శిక్షించాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు.చట్టాలను ఎవరూ కూడా దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం డీడీ కోసాంబి ఐడియాస్ ఫెస్టివల్లో పాల్గొన్న సందర్భంగా ప్రజాస్వామ్యం, అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. విదేశాల్లోనే కాదు దేశీయంగా కూడా భారీ ఎత్తున బ్లాక్ మనీ మూలుగుతోందని రాజన్ పేర్కొన్నారు. విదేశాల్లో దాచుకున్న వారినే కాకుండా ఇలా దేశీయంగా దాచుకున్న నల్ల ధనం కుబేరులను కూడా పట్టుకుని, శిక్షించాలన్నారు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా పన్నులు గణనీయంగా తగ్గాయని, ప్రస్తుతం సహేతుక స్థాయిలోనే ఉన్నాయని రాజన్ తెలిపారు. వీటిని కూడా ఎగ్గొడితే పన్నుల వ్యవస్థను అవహేళన చేసినట్లేనన్నారు. ‘ప్రజలు పన్నులు కట్టేందుకు తగిన అవకాశం ఇవ్వాలి. అప్పటికీ కట్టకపోతే అప్పుడు శిక్షించాలి. పన్నులు ఎగ్గొడితే శిక్ష తప్పదు అన్న విషయం స్పష్టంగా తెలియాలి. ఇందుకోసం పన్నుల వ్యవస్థను పటిష్టం చేయాలి’ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడం ముఖ్యమని, ఇందుకోసం ప్రభుత్వం సరైన విధానాలను రూపొందించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వారసత్వ ఆస్తి పన్నులు సరికాదు.. వారసత్వ ఆస్తిపై పన్నుల విధానాన్ని తప్పుపడుతూ .. ప్రభుత్వం ప్రజలను సంపన్నులుగా చేయడంపైనే దృష్టి పెట్టాలే తప్ప వారసత్వంగా సంపద దక్కించుకున్న వారిని సాధారణ స్థాయికి దిగజార్చకూడదన్నారు. అసలు ఇలాంటి పన్నులు విధిస్తే సంపద సృష్టించే వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా పోతాయన్నారు. అటు ఆర్థిక రంగ చట్టాల సంస్కరణల కమిషన్ (ఎఫ్ఎస్ఎల్ఆర్సీ) చేసిన సిఫార్సులపైనా పరోక్షంగా ఆయన విమర్శలు సంధించారు. లెసైన్స్ పర్మిట్ జమానా నుంచి బైటపడిన దేశం తాజాగా అపీలేట్ జమానా బారిన పడకూడదన్నారు. ఆర్బీఐ సహా ఆర్థిక రంగానికి సంబంధించిన నియంత్రణ సంస్థలన్నిటీకీ ఒకే అపీలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్న ఎఫ్ఎస్ఎల్ఆర్సీ సిఫార్సు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం పటిష్టంగా ఉంటే సరిపోదు.. ప్రభుత్వం పటిష్టంగా ఉన్నంత మాత్రాన సరైన దిశలోనే పాలిస్తుందని ఏమీ లేదని రాజన్ వ్యాఖ్యానించారు. దీనికి నియంత హిట్లర్ ఉదంతమే నిదర్శనమన్నారు. ‘హిట్లర్ జర్మనీలో అత్యంత సమర్ధమైన పాలనే అందించాడు. 1975-77 మధ్య ఎమర్జెన్సీ విధించినప్పుడు మన దగ్గర నడిచినట్లే.. ఆయన పాలనలో కూడా రైళ్లు సరిగ్గా సమయానికి నడిచేవి. ఆయన ప్రభుత్వం చాలా పటిష్టమైనది కూడా. కానీ చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి ఆయన జర్మనీని పతనం వైపుగా నడిపించాడు’ అని రాజన్ చెప్పారు. కాబట్టి.. చిత్తశుద్ధి, నైపుణ్యం, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం గలవారే పటిష్టమైన ప్రభుత్వానికి సారథ్యం వహించాలని ఆయన వ్యాఖ్యానించారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం వంటివి కల్పించినప్పుడే సమ్మిళిత వృద్ధిని సాధ్యమన్నారు. -
నల్ల కుబేరుల అందరి పేర్లు రేపు వెల్లడి!
న్యూఢిల్లీ: నల్ల ధనం కేసులో అందరి పేర్లను కేంద్ర ప్రభుత్వం రేపు బుధవారం సుప్రీం కోర్టుకు సమర్పించనుంది. ఈ కేసులో కేంద్రం వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బ్లాక్ మనీ దాచినవారి పేర్ల జాబితా సీల్డ్ కవర్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. గత ఆదేశాలను సవరించాలన్న కేంద్రం తీరుపై కోర్టు మండిపడింది. విదేశాలో డబ్బు దాచినవారిని ఎందుకు కాపాడతారు? అని ప్రశ్నించింది. సోలిసిటర్ జనరల్ సమక్షంలోనే గతంలో ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. కొత్త ప్రభుత్వం మార్పులు చేయమనడం సరికాదంది. ఉత్తర్వులలో ఒక్క పదాన్ని కూడా మార్చం అని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ రోజు దాదాపు 30 నిమిషాల సేపు విచారణ కొనసాగింది. జర్మనీ సహా వివిధ దేశాల నుంచి 500 పేర్లు వచ్చినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం విచారణ చేస్తే జీవిత కాలంలో కేసు పూర్తి కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు వ్యాఖ్యానించారు. పేర్లు ఇవ్వండి, తదుపరి ఆదేశాలు తాము జారీ చేస్తామని కోర్టు తెలిపింది. నల్ల ధనాన్ని వెనుకకు తెచ్చే వ్యవహారాన్ని ప్రభుత్వానికి వదిలిపెట్టలేమని కోర్టు స్పష్టం చేసింది. విదేశాలలో బ్యాంకు ఖాతాలు ఉన్నవారి ప్రయోజనాలను కేంద్రం కాపాడవలసిన అవసరంలేదని కోర్టు చెప్పింది. దానిని సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) చూసుకుంటుందని సుప్రీం కోర్టు తెలిపింది. ** -
గడగడలాడుతున్న నల్ల కుబేరులు!
నల్ల కుబేరుల జాబితా మొత్తం బయట పెట్టాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఇప్పుడు దేశమంతా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. పలువురు వ్యాపారులు, రాజకీయ నేతలు విదేశీ బ్యాంకులలో లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ముగ్గురు వ్యాపారుల పేర్లను మాత్రమే కేంద్రం సమర్పించడంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం నాటికి పూర్తి జాబితా వెల్లడించాలని ఆదేశించింది. దీంతో అందరి పేర్లను కేంద్రం రేపు సుప్రీంకోర్టు ముందు ఉంచనుంది. ఆ నల్ల కుబేరులు ఎవరన్నది బయటి ప్రపంచానికి తెలియకున్నా, విదేశాలలో డబ్బులు దాచుకున్న వారు మాత్రం గడగడలాడిపోతున్నారు. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనంపై గడచిన రెండున్నర దశాబ్దాలుగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఎనిమిది మంది పేర్లను కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో మరో 22 మంది పేర్లు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతనొక హోటల్ వ్యాపారి. దేశం నలుమూలలా అతని హోటల్ సామ్రాజం విస్తరించి ఉంది. అలాంటి వ్యక్తికి విదేశాల్లో 25 అకౌంట్లు వున్నాయి. ఆయా బ్యాంక్ ఖాతాల్లో లక్షా 45 వేల 600 కోట్లు దాచుకున్నారు. టెలికం దిగ్గజంగా పేరుగాంచిన ఓ దక్షిణాది సీనియర్ రాజకీయ నేత కూడా విదేశాల్లో అకౌంట్లు ఆపరేట్ చేస్తున్నారు. ఒకటీ రెండు కాదు ఏకంగా 15 బ్యాంక్ ఖాతాల ద్వారా ఆయన తన లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఆ నేత విదేశాల్లో దాచుకున్న సొత్తు 15 వేల కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. మరో వ్యక్తి విషయానికొస్తే, దేశవ్యాప్తంగా చైన్‌లింక్‌తో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇండియా మొత్తంగా పలు హాస్పిటల్స్ నడిపిస్తున్నారు. ఆయన విదేశాల్లో రెండు అకౌంట్లు ఆపరేట్ చేస్తున్నారు. ఆయన అకౌంట్లో 28 వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఓ కేంద్ర మాజీ మంత్రి కూడా విదేశాల్లో రెండు అకౌంట్లు నిర్వహిస్తున్నారు. అకౌంట్స్‌లో 14 వేల 500 కోట్ల రూపాయలు వున్నట్లుతెలుస్తోంది. యూత్ కాంగ్రెస్ నేతగా పలువురికి పరిచయమైన మరో కేంద్ర మాజీ మంత్రికి కూడా విదేశీ ఖాతాలు ఉన్నారు. ఆ నేతకు విదేశాల్లో ఐదు అకౌంట్లు వున్నట్లు తెలుస్తోంది. ఆయా అకౌంట్లలో 9 వేల కోట్ల రూపాయలు వున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి ఒకరికి విదేశీ బ్యాంకులలో రెండు ఖాతాలు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు అకౌంట్లలో 29 వేల 800 కోట్ల రూపాయలు దాచుకున్నట్లు తెలుస్తోంది. మరో మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఇద్దరికి 10 అకౌంట్లు వున్నట్లు సమాచారం. ఆయా అకౌంట్లలో 10 వేల 500 కోట్ల రూపాయలు జమ అయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా హోటల్స్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కూడా విదేశాల్లో ఒక బ్యాంక్ ఖాతా ఓపెన్ చేశారు. ఈ ఖాతాలో 4 వేల 520 కోట్లు దాచుకున్నట్లు తెలుస్తోంది. ఇంకో మాజీ ముఖ్యమంత్రి కూడా తన విదేశీ బ్యాంకు అకౌంట్లో 8 వేల 200 కోట్ల రూపాయలు దాచినట్లు సమాచారం. వివాదాస్పదుడిగా ముద్రపడిన తమిళనాడుకు చెందిన మాజీ కేంద్ర మంత్రి ఖాతాలో 7 వేల 800 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ స్టాక్‌మార్కెట్ బ్రోకర్ ఆపరేట్ చేస్తున్న 5 ఖాతాలలో 3 వేల 900 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. మరో స్టాక్ మార్కెట్ మాయాజాలకుడు 13 ఖాతాలు ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఖాతాలలో లక్షా 35 వేల కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పది ఖాతా నెంబర్లు, ఆ ఖాతాలలో ఉన్న నగదు వివరాలు వెల్లడయ్యాయి. తెలిసిన సమాచారం ప్రకారం ఏ ఏ ఖాతా నెంబర్లో ఎంతెంత నగదు దాచుకున్నారో ఆ వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. అయితే ఆ ఖాతాదారుల పేర్లు మాత్రం బయటకు రాలేదు. ఖాతా నెంబర్ నిల్వ ఉన్న నగదు 1. IN 155869-256648-102011 : రూ.లక్షా 98 వేల 356 కోట్లు 2. IN 959666-021465-255614 : లక్షా 35 వేల 121 కోట్లు 3.IN 256689-1025-125488 : రూ. 7 వేల 856 కోట్లు 4. IN 121668-1254588-125448 : రూ. 28 వేల 956 కోట్లు 5. IN 252684-451215-125683 : రూ. 33 వేల 451 కోట్లు 6. IN 656448-120201-235454 : రూ. 5 వేల 560 కోట్లు 7. IN 918541-231548-412587 : రూ 35 వేల 9 కోట్లు 8. IN 856479-265689-412458 : రూ.8 వేల 256 కోట్లు 9.IN 102012-128458-105555 : రూ. 96 వేల 455 కోట్లు 10. IN 254122-457895-124512 : రూ.15 వేల 90 కోట్లు **