టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు విదేశీ బ్యాంకుల్లో 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కోలా కృష్ణమోహన్ ఆరోపించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు విదేశీ బ్యాంకుల్లో 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కోలా కృష్ణమోహన్ ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తనవద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిని సీబీఐకి అందజేస్తానని అన్నారు. తనకు కేవలం 47 కోట్లే ఉన్నాయంటూ ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన విషయం పచ్చి అబద్ధమని, దీనిపై తాను ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్.. గతంలో ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, వాళ్లిద్దరికీ ఒక అబ్బాయి కూడా ఉన్నాడని కోలా కృష్ణమోహన్ ఆరోపించారు. లోకేష్ చేతిలో మోసపోయిన అమ్మాయి మరో రెండు రోజుల్లో మీడియా ముందుకు కూడా వస్తుందని ఆయన చెప్పారు.