ప్రభుత్వడాక్టరు, మరో ఇద్దరు కలిసి.. అఘాయిత్యం!
ప్రభుత్వడాక్టరు, మరో ఇద్దరు కలిసి.. అఘాయిత్యం!
Published Wed, Dec 7 2016 10:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
దక్షిణ ఢిల్లీలోని మోతీబాగ్ ప్రాంతంలో ఘోరం జరిగింది. ఎన్‌డీఎంసీ ఆస్పత్రిలో పనిచేసే ఒక వైద్యుడు, మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు కలిసి ఆస్పత్రి ప్రాంగణంలోనే ఓ కాంట్రాక్టు కార్మికురాలిపై అత్యాచారం చేశారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఇద్దరూ కలిసి తనను ఒక ల్యాబ్‌లో బంధించి, ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారని బాధితురాలు (29) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే బాగోదని హెచ్చరించి ఆమెను వదిలేశారు. ఆ తర్వాత ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, అఫ్జల్ అలీఖాన్ అనే వైద్యుడికి పరిచయం చేశారు. ఆయన కూడా అదే ఆస్పత్రిలో పనిచేస్తారు. ఆయన క్యాబిన్‌లోనే వైద్యుడు తనపై అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితులలో ఇద్దరిని అరెస్టు చేశారు. ఖాన్ కాంట్రాక్టును రద్దుచేశామని, టెక్నీషియన్లు ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఆస్పత్రిలో విచారణ జరుపుతామని, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకంఉటామని ఆస్పత్రి డైరెక్టర్ రణ్‌వీర్ సింగ్ చెప్పారు.
అక్టోబర్ నెలాఖరులో తాను పని ముగించుకుని వెళ్లడానికి సిద్ధం అవుతుండగా, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు తనను ఆపి, పైకి తీసుకెళ్లి, ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. తర్వాత నవంబర్ మొదటివారంలో తనకు పరిచయమైన ఒక తోటమాలి కూడా తనపై అత్యాచారం జరిపాడని చెప్పింది. వైద్యుడితో పాటు ఒక టెక్నీషియన్‌ను అరెస్టు చేశామని, మరో టెక్నీషియన్ దొరకాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
Advertisement
Advertisement