సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌తో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార సారథ్య కమిటీ చైర్మన్ చిరంజీవి, కోచైర్మన్ డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారమిక్కడ భేటీ అయ్యారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ను ఎన్నికల్లో గట్టెక్కించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. విభజన వల్ల సీమాంధ్రకు మేలే జరిగిందని, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు లభించాయని, ఈ అంశాలు ప్రధాన ఎజెండాగా ఎన్నికల ప్రచారం ఉండాలని జైరాం వారికి సూచిం చినట్టు సమాచారం.