న్యూ ఢిల్లీ: ఈస్టర్ పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామరస్యం, మానవ సంబంధాలలో యేసు క్రీస్తు స్పూర్తివంతమైన బోధనలు గుర్తు చేసుకోవాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ట్విట్టర్ ద్వారా ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. పివిత్రమైన ఈస్టర్ పర్వదినం ఎల్లప్పుడూ.. మానవత్వంపై యేసు క్రీస్తు అనంతమైన ప్రేమను గుర్తుచేస్తుందని ప్రణబ్ తెలిపారు. ప్రేమ, త్యాగం, సత్యం, క్షమాపణ లాంటి క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకమన్నారు.
The sacred day of Easter is a constant reminder of Jesus Christ’s endless love for humanity #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) March 27, 2016